కొరియన్ బ్యూటీస్ చిట్కాలు.. గ్లోయింగ్ స్కిన్ కోసం 9 ఈజీ స్టెప్స్

క్లెన్సింగ్

3 టీస్పూన్ల పాలలో చిటికెడు పసుపు కలపండి. అందులో కాటల్ బాల్ ను ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీని వల్ల మీ చర్మంలోని మలినాలు మటుమాయమైపోతాయి.

స్టీమింగ్

నీటిని మరిగించి, అందులో అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఓ 10నిమిషాలు ఆవిరి పట్టండి. ఇది మీ చర్మంపై రంధ్రాలను తెరుస్తుంది.

ఎక్స్ ఫోలియేట్

ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ లో, ఒక టీస్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి సున్నితంగా స్ర్కబ్ చేసి 10నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

టోనర్ అప్లై

ఒక టీస్పూన్ రోజ్ వాటర్, అలోవెరా జెల్ రెండూ కలపి ముఖంపై స్ప్రే చేయండి. 10నిమిషాల తర్వాత మెత్తని టవల్ తో శుభ్రం చేసుకోండి. ఇది చర్మం పీహెచ్ సమతుల్యతను కాపాడుతుంది.

ఎసెన్స్ అప్లై

కలబంద రసం, గ్లిజరిన్ స్ప్రే బాటిల్ లో కలిపి ముఖంపై స్ప్రే చేయండి. ఆ తర్వాత మీ అరచేతులతో మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని పునరుద్దరించడానికి సహాయపడుతుంది.

సీరమ్ అప్లై

ఒక టీస్పూన్ అలోవెరా జెల్, చిటికెడు పసుపును కలిపి ముఖానికి అప్లై చేయండి. 10నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మొటిమలతో పోరాడి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

షీట్ మాస్క్

బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. కాటన్ షీట్ మాస్క్ ను బియ్యం నీటిలో నానబెట్టాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది మొటిమల నిరోధక ప్రయోజనాలను అందిస్తుంది.

ఐ క్రీమ్ అప్లై

ఒక టీస్పూన్ అలోవెరా జెల్, 3చుక్కల కొబ్బరి నూనె కలిపి.. కంటి కింద అప్లై చేయాలి. దీన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది మీ కంటి చుట్టు ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మాయిశ్చరైజర్

2 చుక్కల బాదం నూనెలో ఒక టీస్పూన్ అలోవెరా జెల్ కలపండి. అప్లై చేసి రాత్రంతా ఉంచి, మార్నింగ్ కడుక్కోండి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here