నట్స్ నుంచి చీజ్ వరకు.. బరువు తగ్గించుకునేందుకు ఈజీ టిప్స్..

అదనపు బరువును తగ్గించుకోవడం కోసం అనేక చిట్కాలు, ఉపాయాలు ఉన్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి చాలానే ఉన్నాయి. బరువు తగ్గడం కొందరికి ఒత్తిడిని కలిగించే ప్రక్రియ. మరికొందరికి చాలా ఈజీగా అనిపిస్తుంది. అదనంగా ఉన్న కిలోలలను కోల్పోవడానికి అత్యంత సాధారణ మార్గాలలో ఒకటి భోజనం మానేయడం, అధిక వ్యాయామం. అలా అని రోజంతా భోజనం మానేస్తే ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకు శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లను అందించడానికి భోజనాల మధ్య స్నాక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున భోజనాల మధ్యలో పండ్లు, కూరగాయలు లాంటి స్నాక్స్ తీసుకోవడం మంచిది.

పెరుగు

పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనికి ఆహార పదార్థాలను జీర్ణం చేసే సామర్థ్యం ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండడంతో.. ఎక్కువకాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఇది అధిక ఆకలిని నిరోధించి, బరువు నిర్వహణను ప్రోత్సహిస్తుంది.

గింజలు, విత్తనాలు

గింజలు, విత్తనాలలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. భోజనాల మధ్యలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలు పెరుగుతాయి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్ ఆరోగ్యకరమైన శరీరానికి తోడ్పడతాయి. ముఖ్యంగా స్ర్తీలకు ఇవి చాలా అవసరం.

చీజ్

కొవ్వులు, సోడియం, కేలరీలు, ప్రోటీన్లు, కాల్షియం లాంటి ఇతర పోషకాలతో కూడిన చీజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. జున్ను పాలతో దీన్ని తయారు చేయబడినందున ఇందులో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ కడుపును ఎక్కువ గంటలు నిండుగా ఉండేలా చేస్తుంది, ఆకలిని నివారిస్తుంది.

ఉడికించిన గుడ్లు

ఉడికించిన గుడ్లు అత్యంత పోషకాహార పదార్థం. భోజనాల మధ్య దీన్ని కూడా తీసుకోవచ్చు. ఉడికించిన గుడ్లలో కేలరీలు, పోషకాలు, విటమిన్ బి, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here