కథ బాగా నచ్చి పాములంటే భయం ఉండడంతో ఓ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను అల్లరి నరేష్ మిస్ చేసుకున్నారట. అదే కార్తికేయ మూవీ. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 కూడా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంది. దాదాపు ఆరు కోట్లతో తెరకెక్కిన కార్తికేయ చిత్రం రూ. 20 కోట్లు రాబట్టింది.
అయితే కార్తికేయ చిత్రానికి ముందుగా హీరోగా అల్లరి నరేష్ ను అనుకున్నారట మేకర్స్. కథ కూడా బాగా నచ్చిందట . కానీ ఈ సినిమాలో పాములు ఎక్కువగా కనిపించండం, పాములు అంటే తనకు వ్యక్తిగతంగా భయం ఉండడం వలన ఈ సినిమాను రిజెక్ట్ చేశారట నరేష్.. ఈ విషయానికి నరేష్ స్వయంగా వెల్లడించాడు.
బయటే కాదు సినిమాల్లోనూ పాములకు సంబంధించిన సన్నివేశాలు వచ్చిన తాను భయపడతాను అని నరేష్ తెలిపాడు. ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడతాను అని నరేష్ వెల్లడించాడు. ఇక కామెడీ స్టార్ గా ఎదిగిన నరేష్.. తన ట్యాగ్ లైన్ ను పక్కన పెట్టి నాంది ఉంగ్రం, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం వంటి సీరియస్ కథలో నటించారు.