ఐశ్వర్య రాయ్ ఐరెన్ లెగ్ అని తెలుగులో వద్దన్నారట..!

వెంకటేష్ హీరోగా అంజల ఝువేరి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ప్రేమించుకుందాం రా. జయంతి సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1997 మే 09న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయన్ని అందుకుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, జయప్రకాష్ విలనిజం, మణిశర్మ అందించిన సంగీతం సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళాయి. ఇటీవల పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా అంజల ఝువేరిను అనుకోలేదట..అప్పుడే బాలీవుడ్లో రెండు సినిమాలు చేసిన మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ ను హీరోయిన్ గా తీసుకుందామని జయంత్ అనుకుంటే మేకర్స్ వద్దు అన్నారట. ఎందుకుంటే అప్పటికే ఆమె చేసిన రెండు సినిమాలు బాలీవుడ్ లో ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ గా వద్దు అనుకున్నారట. దీంతో ఆమె ప్లేస్ లో అంజల ఝువేరిని తీసుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు జయంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

అయితే జయంత్, నాగర్జున కాంబోలో వచ్చిన రావోయి చందమామ సినిమాలో ఐశ్వర్య రాయ్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఆ తరవాత ఆమె తెలుగు సినిమాలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఇదే ఆమెకు చివరి సినిమా కూడా. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రీతి జింతాను అనుకుని ఆమె కలిసేందుకు ముంబైకు వెళ్ళిన జయంత్ కు ఐశ్వర్య కనిపించారట.

అలా రావోయి చందమామ సినిమాలో ఈ బాలీవుడ్ హీరోయిన్ కు ఛాన్స్ దక్కింది. ఇక ఆ తరవాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన ఐశ్వర్య రాయ్ అక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here