ఆరెంజ్ మూవీ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరెంజ్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ గా నిలిచింది. మగధీర లాంటి భారీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన చిత్రం కావడం, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడం, ఆ అంచనాలను ఆరెంజ్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు ఇంట్లో వస్తే వదలకుండా చూస్తారు.

అయితే ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న మీనింగ్ ను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆరెంజ్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన తనకే వచ్చిందని భాస్కర్ చెప్పుకొచ్చారు. సినిమా స్టోరీకి తగినట్లు ఉంటుందని దీన్ని సెలెక్ట్ చేశానన్నారు. ప్రేమలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయని తాను అనుకుంటానని, ఒక వ్యక్తిపై ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి దీనిని సూర్యోదయం, సూర్యాస్తమయంతో పోల్చానన్నారు. ఆ రెండు సమయాల్లో సూర్యుడు ఆరెంజ్ రంగులోనే ఉంటాడు. అందులో సూర్యోదయాన్ని ప్రేమ పెరగడాన్ని, సూర్యాస్తమయం ప్రేమ తగ్గడాన్ని సూచిస్తుందని అందుకే ఈ చిత్రానికి ‘ఆరెంజ్’ అని పెట్టానని తెలిపారు . దీని గురించి వివరంగా చెప్పగానే మా టీమ్ వాళ్లందరూ వెంటనే ఓకే చేశారంటూ ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న కథను చెప్పారు భాస్కర్.

అయితే ముందుగా ఈ కథను న్యూయార్క్ లో తీయాలని అనుకున్నామని కానీ అక్కడ ఆ టైంలో చలి బాగా ఉండడంతో ఆస్ట్రేలియాకు కథను షిఫ్ట్ చేశామని తెలిపారు. కథ అందరికీ నచ్చిందని కానీ సినిమా నచ్చక పోవడానికి కారణం స్క్రీన్ ప్లే ఓ రకంగా కారణం అయి ఉంటుందని తాను అనుకుంటున్నట్లుగా భాస్కర్ తెలిపారు. కాగా ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు నిర్మాత నాగబాబు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here