తేజ, అల్లు అర్జున్ సినిమా ఎందుకు ఆగిపోయింది ?

ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో.. కాదు కాదు పాన్ ఇండియా హీరో.. ఒక్కొక్క సినిమాతో తన స్టార్డం పెంచుకుంటూ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మన స్టైలిష్ స్టార్.. అయితే ఈ సినిమా కంటే ముందు అల్లు అర్జున్ ను తేజ డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అల్లు అరవింద్ అనుకున్నారు.

నువ్వు నేను సినిమా రిజల్ట్ తర్వాత దర్శకుడు తేజకి చాలా ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్లు ఆయనతో సినిమా చేయడానికి తహతహలాడారు. అయితే తాను అనుకున్న కథతో అల్లు అర్జున్ ను హీరోగా పరిచయం చేయాలని తేజ అనుకున్నారు. అయితే లుక్ టెస్ట్ చేస్తే ఆ పాత్రకి అల్లు అర్జున్ సెట్ అవడం లేదని మరో సినిమా చేద్దామని అల్లు అరవింద్ కి చెప్పేశారు తేజ.

నువ్వు నేను సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు తేజకి ఒక అబ్బాయి చాలా నచ్చాడు. ఇంతకీ ఎవరీ అబ్బాయి అని ఆరా తీస్తే… ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు నితిన్ అని తెలిసింది. నువ్వు నేను సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా సుధాకర్ రెడ్డినే. అప్పుడు నితిన్ కి 18 సంవత్సరాలు. నా దగ్గర ఒక కథ ఉంది నువ్వే హీరో చేస్తావా అని డైరెక్ట్ గా నితిన్ ను అడిగేసారు తేజ. సినిమాల్లోకి రావాలని అనుకుంటున్న నితిన్ కి ఇదో బిగ్గెస్ట్ ఆఫర్. దీంతో వెంటనే ఒప్పేసుకున్నారు నితిన్ .

హీరోయిన్ గా సదాను ఫైనల్ చేశారు తేజ. ఇక విలన్ గా బొంబాయికి చెందిన ఓ నటుడ్ని అనుకున్నారు. అయితే అతని హావభావాలు సెట్ అవడం లేదని అతని ప్లేస్ లో గోపీచంద్ కు అవకాశం ఇచ్చారు తేజ. దాదాపు 30 మంది కొత్తవాళ్లతో ఈ సినిమాను తెరకెక్కించారు తేజ. ఇందులో సుమన్ శెట్టి పాత్ర చాలా క్లిక్ అయింది. ఆర్పీ మ్యూజిక్, కులశేఖర పాటలు సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here