సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం ఖలేజా. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్టు సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆపదలో అదుకున్నవాడు దేవుడితో సమానం అని చెప్పే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్. 2010 సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే ఈ సినిమాని ఇప్పుడు టీవీలో వస్తే మాత్రం ప్రేక్షకులు విడిచిపెట్టకుండా మరీ చూస్తారు. ఇంతకీ ఈ సినిమా ప్లాప్ కావడానికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషించుకుందాం.
ప్రతి సినిమాకి ఒక జోనర్ అంటూ ఉంటుంది అయితే ఖలేజా చిత్రానికి మాత్రం ఏ జోనర్ అంటే కచ్చితంగా చెప్పలేం. ఇది మల్టిపుల్ జోనర్.
ఎదుటివారికే సహాయం చేయాలన్నప్పుడు దేవుడు మన హెల్ప్ చేస్తాడు ఆ సహాయమే దేవుడు అని చెప్పే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్.. అయితే హీరో చేసే పనులకు ఆడియన్స్ కు సీరియస్ నెస్ కాకుండా కామెడీగా అనిపించాయి.
సీరియస్ కథను చాలా సీరియస్ గా చెప్పాలి.. కానీ ఒకపక్క కథను చెబుతూ.. మరోపక్క కామెడీని నడిపిస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లారు త్రివిక్రమ్. ఇది సినిమాకి మరో మైనస్ గా మిగిలింది.
ఈ సినిమాకి మరో మైనస్ హీరోయిన్ అనుష్క.. మహేష్ బాబుకి అనుష్క అక్కగా ఉందని అప్పట్లో సెటైర్లు వేశారు ఆడియన్స్..
ప్రీప్రొడక్షన్ సమయంలో స్క్రిప్టు రాసుకోవడం పూర్తయ్యాకా షూటింగ్ మొదలై నడుస్తున్న సమయంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ సినిమా తెరకెక్కించారు. ఇది కూడా సినిమాకు మైనస్ గా మారింది.