వేడిని తట్టుకోవడానికి కోల్డ్ కాఫీ తాగుతున్నారా.. జాగ్రత్త

వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్లగా, రిఫ్రెష్ గా ఉండే డ్రింక్స్, పానీయాలు తీసుకోవడానికే చాలా మంది మొగ్గు చూపిస్తారు. అందులో చాలా మంది ఎంపిక చేసుకునే పానీయం చల్లని కాఫీ.. అదే కోల్డ్ కాఫీ. మామూలుగా దీన్ని ఎవరైనా ఇష్టపడతారు. అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. కానీ చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. కోల్డ్ కాఫీ వల్ల అంతకంటే ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కోల్డ్ కాఫీలో షుగర్, చాక్లెట్ సాస్ వంటి టాపింగ్ల్ ఉంటాయి. ఇవి అధిక చక్కెరలను కలిగి ఉంటాయి. దీన్ని అధికంగా తీసుకున్నపుడు కేలరీలు ఎక్కువై క్రమంగా బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. అంతే కాదు దీని వల్ల టైప్ -2 మధుమేహం, ఊబకాయం వంటి ధీర్ఘకాలిక వ్యాధులూ వచ్చే అవకాశం ఉంది.

కోల్డ్ కాపీలో చక్కెర పరిమితులను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. మహిళలు రోజుకు 24 గ్రాములు, పురుషులు రోజుకు 36 గ్రాములు తీసుకోవచ్చని తెలిపింది. రోజూ ఒక్క గ్లాసు కోల్డ్ కాఫీని తీసుకోవచ్చని చెప్పింది. రెండు లేదా అంత కన్నా ఎక్కువ గ్లాసుల కోల్డ్ కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫిన్ ఆరోగ్యానికి హాని చేస్తుందని ప్రకటించింది. కాబట్టి దీన్ని మితంగా తీసుకోవాలని సూచించింది.

కాఫీని ఆరోగ్యవంతంగా చేయడం ఎలా..

  • వెనీలా, దాల్చిన చెక్కలను కాఫీ చేర్చుకుని చక్కెరలను తగ్గించవచ్చు.
    * కొబ్బరి, ఫ్లేక్స్, బాదం పాలు వంటిని చేర్చుకోవడం

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here