సాంబార్, రసం, చట్నీల్లో విరివిగా ఉపయోగించే కరివేపాకు వల్ల చాలా లాభాలున్నాయి. సువాసన గల ఈ ఆకులో సిట్రస్ రుచిని కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది బహుముఖ మూలికా పదార్ఖంగానూ సహాయపడుతుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆకుల్లో కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఫైబర్, కాల్షియం, భాస్వరం, ఇనుము ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, బి, సి, ఇ వంటి వివిధ విటమిన్లు కూడా ఉంటాయి.
క్యాన్సర్ నివారణకు..
కరివేపాకు యాంటీ మ్యుటాజెనిక్ సామర్ఖ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరాన్ని వివిధ క్యాన్సర్ల నుంచి కాపాడతాయని అంటున్నారు. కరివేపాకులోని ఫ్లేవనాయిడ్స్ పెద్దపేగుకు క్యాన్సర్ నివారణవో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు రొమ్ము కణాల పెరుగుదలను నిరోధించడంలోనూ సహాయపడతాయి.
అల్జీమర్స్ కు..
కరివేపాకు అల్జీమర్స్ వంటి మెదడుకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కరివేపాకు సారంలో గ్లూటాతియోన్ ఫెరాక్సిడేస్, సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్, గ్లూటాతియోన్ రిడక్టేజ్ వంటివి మెదడును రక్షించే యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి మెదడను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
గుండెకు..
కరివేపాకు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎలుకలపై నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం కరివేపాకు.. అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. ఇది కేవలం ఎలుకల్లో మాత్రమే శోధించి చెప్పారు. మానవుల్లో ఎలాంటి శోధన చేయలేదు. కాబట్టి దీన్ని నిర్ఖారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.
బరువు తగ్గేందుకు..
కరివేపాలో ఉండే కార్భజోల్ ఆల్కలాయిడ్స్ బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. దీని వినియోగాన్ని పెంచడానికి ఎండిన కరివేపాకులను బాగా తినాలి, భోజనంలో తాజా లేదా ఎండిన ఆకులను జోడించవచ్చు.
విరేచనాలు, మలబద్దకం చికిత్సకు…
నొప్పి, గుండెల్లో మంట, అజీర్ణ, అతిసారం లేదా మలబద్దకం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలకు కరివేపాకు మంచి మేలు చేస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం ఎండిన కరివేపాకులను మెత్తగా రుబ్బి, దాన్ని మజ్జిగలో కలుపుకుని ఖాళీ కడుపుతో తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.