అసాధారణమైన జీవనశైలి, సోమరితనం, ఒకే దగ్గర అదే పనిగా కూర్చోవడం.. చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ అది దీర్ఘకావంవో ఆచరణాత్మకమైనది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె పోటులు, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
- ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు
* రోజంతా కూర్చోవడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది.
* కొవ్వులను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని శరీరం కోల్పోతుంది.
* ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి మధుమేహం, ఊబకాయం వస్తుంది
* ఎముకలు బలహీనమవుతాయి.
* కండరాలు బలాన్ని కోల్పోతాయి.
* మెదడు ప్రభావితం అవుతుంది.
* రక్త నాళాల్లో కొవ్వు ఆమ్లాలు పేరుకుపోయేలా రక్త ప్రవాహాం నెమ్మదిస్తుంది.
కలిగే దుష్ర్పభావాలు
బరువు పెరగడం
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల జీర్ణ క్రియ మందగిస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వులు, చక్కెరలు నిల్వ ఉండిపోతాయి. ఫలితంగా బరువు పెరిగే ఛాన్స్ ఉంది, వీరికి కనీసం 45 నుంచి 50 నిమిషాల వ్యాయామం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఆందోళన, నిరాశ
చుట్టు పక్కల ప్రాంతాల్లో తిరగడం తక్కువైనపుడు ఆందోళన, నిరాళ మొదలవుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. కండరాలు క్షీణించిపోవడంతో పాటు కూర్చునే భంగిమలో సమస్యలు, వెన్ను సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తగినంత విరామం తీసుకుంటూ ఉండడం ఉత్తమం.
క్యాన్సర్, గుండె వ్యాధులు
ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు, గర్బాశయంస పెద్దపేగు క్యాన్సర్ లతో సహా కొన్ని క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు, సైకిల్ తొక్కడం వల్ల క్యాన్సర్ తో మరణించే ప్రమాదం 31శాతం తగ్గుతుంది, నడక వంటి తేలికపాటి వ్యాయామం 8శాతం తక్కువ ప్రమాదానికి దారి తీస్తుంది. ఇక ఎక్కువ సేపు కూర్చుని ఉండే వారికి 64శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.