సినిమాల్లో హీరోయిన్ లను గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆయనకు ఆయనే సాటి. తన 45 ఏళ్ళ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచేయం చేశారాయన . ఇక రాఘవేంద్రరావు సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది పాటలు .. హీరోయిన్లు బొడ్డుపై పూలు, పండ్లు వేయడం రాఘవేంద్రరావు స్పెషాలిటీ.
ద్రక్ష, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నేరేడు ఇలా అన్ని పండ్లతో హీరోయిన్లపై ప్రయోగాలు చేశారు రాఘవేంద్రరావు. అయితే ఈ ట్రెండ్ ను మంచి దొంగ చిత్రంతో స్టార్ట్ చేశారు రాఘవేంద్రరావు. 1988లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో ‘బెడ్ లైట్ తగ్గించనా’ అనే పాటలో తొలిసారి విజయశాంతి పై పండ్లు వేసారు రాఘవేంద్రరావు. ఫస్ట్ నైట్‌కు సంబంధించిన పాట కాబట్టి వెరైటీగా ఉండాలని ఈ పాటను కాస్త కొత్తగా ప్లాన్ చేసారు. ఈ పాటకు చక్రవర్తి అద్భుతమైన బాణీలు సమకూర్చారు.
చిరు, విజయశాంతిపై ఫస్ట్ నైట్ సన్నివేశం కాబట్టి లైట్లు ఆన్ చేసినపుడు ఓ బీట్.. ఆఫ్ చేసినపుడు మరో బీట్ వచ్చేలా చక్రవర్తి ఈ పాటకు ట్యూన్ అందించారు. అలా ‘మంచి దొంగ’ సినిమాలో విజయశాంతిపై తొలి పండు పడింది. ఆ తరువాత చాలామంది హీరోయిన్లపై దర్శకేంద్రుడు పూలుపండ్లు వేసిన సంగతి తెలిసిందే కదా.