మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్ళు. ఇందులో చిరంజీవి సరసన నగ్మా, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్లుగా నటించారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1994, జనవరి 7న విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఏదో ఒక పాత్రను చిరంజీవి పోషిస్తూ మిగిలిన రెండు పాత్రలను డూప్ గా పెట్టడం జరిగింది.
అయితే మరో ఇద్దరు డూపుల్లో నటించింది ఎవరంటే ఒకరు చిరు స్నేహితుడు నటుడు ప్రసాద్ బాబు కాగా, మరోకరు చిరంజీవి పర్సనల్ పి.ఏ సుబ్బారావు. వారిద్దరీ ఎత్తు బరువు చిరంజీవికి సరిగ్గా సరిపోవడంతో వాళ్లను ఈ సినిమా కోసం డూప్ లుగా తీసుకున్నారు.
ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లుకు రోజా రమణినే డబ్బింగ్ చెప్పడం మరో విశేషం.