అనందం సినిమాకు ముందుగా అనుకున్న హీరోహీరోయిన్లు ఎవరు ?

తెలుగులో ఇప్పటివరకు చాలా ప్రేమకథ చిత్రాలు వచ్చాయి. కానీ అందులో గుర్తుండిపోయే చిత్రాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అందులో ఒకటి ఆనందం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాశ్, రేఖ హీరోహీరోయిన్లుగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

తమిళ, కన్నడ భాషలలో ఈ సినిమాను రిమేక్ చేయగా అన్ని భాషల్లోనూ రామోజీ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని బాషల్లో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. తెలుగులో 2001లో విడుదలైన చిత్రం 200రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఆకాశ్‌, రేఖకు ఈ చిత్రం తెలుగులో తొలిచిత్రమైనా తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంతో అప్పటివరకు విలన్ వేషాల్లో ఎక్కువగా కనిపించిన జయప్రకాష్ రెడ్డి హాస్యనటుడిగా మారారు. అయితే ఈ సినిమాకు ముందుగా ఆకాశ్‌, రేఖలను హీరోహీరోయిన్లుగా అనుకోలేదట మేకర్స్. ఉదయ్ కిరణ్, శ్రియ శరణ్‌లతోఈ చిత్రాన్ని తీయాలని భావించారట. ఆకాష్ ను వెంకట్ చేసిన వంశీ పాత్ర కోసం తీసుకున్నారట.

అయితే ఈ ఫీల్ గుడ్ మూవీకి కొత్తవాళ్లు అయితేనే బాగుంటుందని అనుకున్నారట. దీంతో ఆకాష్ ను మొయిన్ లీడ్ లో తీసుకున్నారట. ఆ సమయంలో ఆకాష్ కు తెలుగు తెలియకపోవడంతో తమిళం, ఇంగ్లీషు భాషల్లో డైలాగులు రాసుకున్నాడట. ఇక ఈ సినిమాకు ముందు రేఖ కన్నడలో ఒకే ఒక్క చిత్రాన్ని చేసింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here