ఆరోగ్యకరమైన జుట్టుకు 5 రకాల డ్రై ఫ్రూట్స్… నానబెట్టకుండా తింటే ఏమవుతుందంటే..

రోజురోజుకూ వాతావరణం కలుషితమవుతోంది. దీని వల్ల అందమైన జుట్టు, మెరిసే చర్మం చాలా మందికి కలగా మారింది. చర్మం, జుట్టును రక్షించుకోవడానికి మార్కెట్లో అనేక ఉత్పత్తులు ఉన్నప్పటికీ.. వీటిని పొందేందుకు సహజమైన మార్గాలనే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే ఉత్తమ ఎంపిక అని చాటి చెప్తున్నారు. అందులోనూ డ్రై ఫ్రూట్స్ మరింత మేలును చేస్తాయని అంటున్నారు.

ప్రతిరోజూ ఈ 5 గింజలను తీసుకుంటే, మీరు సహజంగానే అందమైన జుట్టు, చర్మాన్ని సొంతం చేసుకుంటారు. నల్ల ఎండుద్రాక్ష, బాదం, ఖర్జూరం, పిస్తాపప్పులు, వాల్‌నట్‌లు – ఈ 5 వస్తువులను తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజంతా శక్తివంతంగా ఉండేందుకు ఐరన్‌ని వృద్ధి చేసుకోవడం వల్ల అందమైన జుట్టు, మెరుస్తున్న చర్మం సొంతమవుతాయి. అందుకు ఈ సాధారణ గింజలతో మీ రోజును ప్రారంభించండి.

నలుపు ఎండుద్రాక్ష

నల్ల ఎండుద్రాక్షలో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మం, జుట్టుకు మంచివి. వీటితో పాటు అదనంగా ఇందులో ఎల్-అర్జినైన్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది గర్భాశయం & అండాశయాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

బాదం

బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, ఐరన్, పొటాషియం, జింక్, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి & రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తాయి.. క్యాన్సర్‌ను నివారిస్తాయి.

డేట్స్

ఖర్జూరంలో సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఖర్జూరాలు మీకు తక్షణ శక్తిని అందిస్తాయి, చర్మాన్ని మెరుగుపరుస్తాయి, నిద్రలేమిని పరిష్కరిస్తాయి, ఎముకలకు శక్తినిస్తాయి.

పిస్తాపప్పులు

ఇవి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాల లక్షణాలను కలిగి ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ B6, థయామిన్ లు ఉండడం వల్ల మంచి నిద్రకు మేలు చేస్తాయి. కంటి-ఆరోగ్యానికే కాకుండా పెద్దప్రేగుకు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అక్రోట్స్

వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఒమేగా-3 సూపర్ ప్లాంట్ సోర్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయయి. మెరుగైన ఆరోగ్యానికి తోడ్పడుతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

ఆయుర్వేదం ప్రకారం, ఈ గింజలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. వీటిలో అధిక మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ లు ఉంటాయి. కాబట్టి, మీరు వాటిని తినడానికి ముందు 6-8 గంటలు నానబెట్టండి. నానబెట్టడం వల్ల దాని ఉష్నాట (వేడి) తగ్గుతుంది.ఫైటిక్ యాసిడ్/టానిన్‌లను తొలగిస్తుంది, మీరు వాటిని నానబెట్టడం మరచిపోతే, వాటిని పొడిగా వేయించి, ఆపై తినండి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here