సిగరెట్ తాగడం మానేసిన నటులు వీరే..

పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిగరెట్ తాగడం మానేసిన కొంతమంది టాప్ సెలెబ్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

హృతిక్ రోషన్ : అలాన్ కార్ నటించిన ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ పుస్తకాన్ని చదివిన తర్వాత హృతిక్ రోషన్ స్మోకింగ్ మానేశాడు.

సైఫ్ అలీ ఖాన్ : సైఫ్ అలీ ఖాన్ 2007లో చిన్నపాటి గుండెపోటుకు గురయ్యాడు. ఆ సంఘటన తర్వాత అతను ధూమపానం మానేయాలని నిశ్చయించుకున్నాడు.

అర్జున్ రాంపాల్ : అర్జున్ రాంపాల్ తనకు అరిక్ అనే మగబిడ్డ పుట్టిన తర్వాత స్మోకింగ్ మానేశాడు.

కొంకణ సెన్ శర్మ : కొంకణ సెన్ శర్మ గర్భధారణ సమయంలో జీవన శైలిలో మార్పులు చేసుకుంది. అందులో భాగంగా సిగరెట్ తాగడం మానేసింది.

పురబ్ కోహ్లీ : తనకు కుమార్తె ఇనాయ పుట్టిన తర్వాత పురబ్ కోహ్లీ ధూమపానం చేయడం మానేశాడు.

షాహిద్ కపూర్ : కబీర్ సింగ్ షూటింగ్ తర్వాత షాహిద్ కపూర్ ధూమపానం మానేశాడు. ఆ సమయంలో అతను రోజుకు దాదాపు 20 సిగరెట్లు తాగాల్సి వచ్చింది.

వివేక్ ఒబెరాయ్ : కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించిన తర్వాత వివేక్ ఒబెరాయ్ సిగరెట్ తాగడం ఆపేశాడు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here