వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు, పీచు కణజాలం పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కొంత మందికి గుండె పరిమాణంలో చిన్న పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా ఎడమ జఠరికలో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుంది.
గుండె పరిమాణం పెరుగుతున్నప్పటికీ గుండె గోడలు గట్టిపడడం వల్ల గుండె గదుల్లో ఉండే రక్తం శాతం తగ్గిపోవచ్చు.
వృద్ధులు కర్ణిక దడ వంటి అసాధారణ హృదయ స్పందనలను అనుభవించే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్ది గుండె కండరాల కణాలు క్రమంగా క్షీణిస్తాయి. రక్త ప్రవాహాన్ని నియంత్రించే గుండె అంతర్గత కవాటాలు కాలక్రమేణా చిక్కగా, గట్టిపడతాయి. పెద్దవారిలో గట్టి కవాటాల ద్వారా వచ్చే కార్డియాటిక్ చాలా విలక్షణమైనది.
గుండె కండరాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఛాతినొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాలక్రమేణా శ్వాస ఆడకపోవడానికి కారణం కావచ్చు. గుండె బలహీనత కారణంగా అధిక రక్తపోటు, ఆర్థోస్టాటిక్ హైపో టెన్షన్ సంభవించే అవకాశం ఉంది.