జుట్టు రాలడాన్ని ఆపడానికి ఇంట్లో తయారుచేసుకునే హెయిర్ ప్యాక్ లు

అలోవెరా, కొబ్బరి నూనె

ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల తాజా అలోవెరా జెల్ ను తీసుకుని, దానికి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయండి.

గుడ్డు, ఆలివ్ నూనె

ఒక గిన్నెలో 1లేదా 2గుడ్లు కొట్టి, దానికి 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నుంచి 30నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయండి.

కరివేపాకు, కొబ్బరి నూనె

ఒక బాణలిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడిచేసి, దానికి కొన్ని కరివేపాకులను జోడించండి. ఈ ఆకులు నూనెలో కాసేపు ఉడికాక.. ఆపై నూనెను వడకట్టి జుట్టుకు పట్టించండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేకంటే ముందు 30నిమిషాలు అలాగే ఉంచండి.

ఉల్లిపాయ, తేనె

ఒక ఉల్లిపాయను తీసుకుని, దాన్ని రసాన్ని వడకట్టండి. దానికి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల తేనెను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేకంటే ముందు 30నిమిషాలు అలాగే ఉంచండి.

మెంతులు, కొబ్బరి పాలు

2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలను కలిపి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేకంటే ముందు 30నిమిషాలు అలాగే ఉంచండి.

పెరుగు, నిమ్మకాయ

ఒక గిన్నెలో సగం నిమ్మకాయ రసం తీస్కోని, దానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలపారి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయండి.

హెన్నా, ఆమ్లా

ఒక గిన్నెలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, అంతే మోతాదులో ఉసిరి పొడిని కలపాలి. ఈ మిశ్రమానికి నీటిని జోడించి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేకంటే ముందు 30నిమిషాలు అలాగే ఉంచండి.

మందార, కొబ్బరి నూనె

గుప్పెడు మందార పువ్వులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి, 30నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయండి.

గ్రీన్ టీ, ఆపిల్ సైడల్ వెనిగర్

ఒక కప్పు గ్రీన్ టీని కాసి, చల్లార్చాలి. 1లేదా 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తో టీని మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేకంటే ముందు 30నిమిషాలు అలాగే ఉంచండి.

అరటి, తేనె

పండిన అరటిపండును మెత్తగా చేసి, ఒక గిన్నెలో తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల తేనెకు కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి 30నిమిషాల పాటు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడిగేయాలి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here