అంతిమ యాత్రగా మొదలైన కథ ‘ఆ నలుగురు’గా ఎలా మారింది?

మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ఆ నలుగురు. చంద్ర సిద్ధార్ధ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మదన్ కథను అందించారు. 2004లో విడుదలైన ఈ చిత్రానికి నంది అవార్డు లభించింది. ఇంతకీ ఈ సినిమా ఎలా మొదలైందో ఒక్కసారి చూద్దాం.

ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన అంతిమయాత్రకు ఊరికి ఊరే కదలివచ్చింది, కారణమేంటంటే ఆయన జీవించినన్నాళ్ళూ చుట్టూ ఉన్నవాళ్ళు బావుండాలని కోరుకునేవారు. సాధ్యమైనంత సాయాన్ని పక్కవారికి చేసే అలవాటున్న వ్యక్తి కావడంతో ఊరు ఊరంతా ఆయన అంతిమయాత్రకు తరలివచ్చి కన్నీరు కార్చారు. ఈ సంఘటన రచయిత మదన్ మనస్సును కదిలిచింది, ఈ సంఘటన ఆధారంగా తయారుచేసుకున్న కథని సీరియల్ స్క్రిప్ట్ గా అభివృద్ధి చేసుకున్నారు, స్క్రిప్ట్ పేరు అంతిమయాత్ర.

26 ఎపిసోడ్లకు తయారుచేసిన స్క్రిప్ట్ లో మొదటి సీనులోనే హీరో చనిపోవడం, చాలా ఎపిసోడ్లలో అంతిమయాత్ర సన్నివేశాలు చూపడం వంటివి ఉండడంతో సెంటిమెంటల్ గా భావించే వీక్షకులు ఈ సీరియల్ తిప్పికొడతారంటూ చాలా మంది ఈ స్టోరీని రిజెక్ట్ చేశారు.చివరికి అట్లూరి పూర్ణచంద్రరావు, ప్రకాష్ రాజ్, భాగ్యరాజ్ వంటి హేమహేమీల దగ్గరికి వెళ్లినప్పటికీ ఈ కథ ముందుకు వెళ్లలేదు.

చివరికి చంద్ర సిద్ధార్ధ, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పారు. ముందుగా అనుకున్న అంతిమయాత్ర అనే పేరును ఆ నలుగురు గా మార్చారు మదన్, చంద్ర సిద్ధార్ధ. రాజేంద్ర ప్రసాద్ పక్కన హీరోయిన్ గా లక్ష్మి, గౌతమి, భానుప్రియ, రోజా ఇలా చాలా మందిని అనుకున్నారు. ఫైనల్ గా అమనిని రాజేంద్ర ప్రసాద్ ఛాయిస్. ఆమె చేయడానికి ఒప్పుకున్నారు. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమెతో కలిసి నటించడంతో ఆయన అమనిని సంప్రదించామని సలహా ఇచ్చారట. కథ విని సినిమాకు ఆమని ఓకే చెప్పారు.

డిసెంబర్ 9 2004 న ఆ నలుగురు సినిమా విడుదలైంది. విడుదలైన రోజున ఈ సినిమా థియేటర్లకు దాదాపు ఖాళీగా ఉన్నాయి. రెండు వారాల దాకా సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైంది. విడుదల చేసినప్పుడు 27 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ స్పందనతో వాటిలో 16 ప్రింట్లు వెనక్కి వచ్చేశాయి. మిగిలిన 11 ప్రింట్లు కూడా వెనక్కి తిరిగివచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ దశలో రెండు వారాలు గడిచాకా సినిమా మౌత్ టాక్ తో సినిమా పుంజుకుంది. హఠాత్తుగా మొత్తం రోజంతా అన్ని షోలూ హౌస్ ఫుల్ అయ్యాయి. ఆ నలుగురు బృందమే కాక మిగతా సినిమా వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని, విమర్శకుల నుంచి ప్రశంసలను పొందింది. అవార్డులను కూడా సాధించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here