మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ఒక్కడు. మహేష్ ను రాత్రికి రాత్రే మార్చేసి స్టార్ హీరోగా చేసిన సినిమా ఇది. ఫ్యాక్షన్ నేపథ్యానికి కబడ్డి టచ్ ఇచ్చి.. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ప్రేమకథ సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే 100 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది ఈ చిత్రం. మహేష్ బాబు, భూమిక పెయిర్, ప్రకాశ్ రాజ్ విలనిజం సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
అయితే ఈ సినిమాలో ముందుగా ఓబుల్ రెడ్డి పాత్ర కోసం ప్రకాష్ రాజ్ నే అనుకున్నారు గుణశేఖర్. ఆ తరువాత ప్రకాష్ రాజ్ డేట్స్ కుదరకపోవడంతో జయం, నిజం చిత్రాలలో గోపీచంద్ నటనను చూసిన గుణశేఖర్.. అతన్ని ఓబుల్ రెడ్డి పాత్ర కోసం తీసుకుందామని అన్నారు. స్టోరీ నరేషన్ కూడా ఇచ్చారు. గోపీచంద్ కూడా చేస్తానని చెప్పాడట. కానీ మళ్లీ ప్రకాష్ రాజ్ డేట్స్ కుదరడంతో గోపీచంద్ ను వద్దనుకున్నారట. అలా గోపీచంద్, గుణశేఖర్ కాంబోలో సినిమా మిస్ అయింది.
అయితే ఈ ఆఫర్ మిస్ కావడంతో ఒక్కడు చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు వర్షం చిత్రంలో గోపీచంద్ కు అవకాశం ఇచ్చారు. విలన్ గా గోపీచంద్ చేసిన సినిమాలు అతని కెరీర్ కు బాగా ఉపయోగపడ్డాయి. రణం చిత్రంతో మళ్లీ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన గోపీచంద్ బాగా క్లిక్ అయ్యాడు.