హీరోగా శ్రీకాంత్ గ్రాఫ్ ఎందుకు పడిపోయింది?

ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఓ స్టార్ హీరోగా ఎదిగి వంద సినిమాలు చేయడం అంటే మాములు విషయం కాదు. హీరో శ్రీకాంత్ ఈ విషయంలో చాలా లక్కీ అని చెప్పాలి. చిన్నచిన్న విలన్ పాత్రలతో సినీ కెరీర్ మొదలుపెట్టి.. వంద సినిమాల హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికి గ్లామర్ ఉన్నప్పటికీ హీరోగా శ్రీకాంత్ కు వేషాలు ఎందుకు తగ్గాయి. శ్రీకాంత్ చేసిన మిస్టేక్స్ ఏంటి.. ? ఓ సారి చర్చిద్దాం.

పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రంతో హీరో శ్రీకాంత్‌‌ సీనీ కెరీర్ మొదలైంది. మొదట్లో చిన్నచిన్న పాత్రలు చేసిన శ్రీకాంత్ వన్‌‌బైటు చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన తాజ్‌‌మహల్ సినిమా మంచి విజయం సాధించడంతో శ్రీకాంత్ కు హీరోగా వరుసగా అవకశాలు వచ్చాయి. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి చిత్రం శ్రీకాంత్ కెరీర్‌‌ని అమాంతం మార్చేసింది.

ఎగిరే పావురమా, వినోదం, ప్రేయసి రావే, ఆహ్వానం, మా నాన్నకు పెళ్ళి, కన్యాదానం సినిమాలు శ్రీకాంత్‌‌ని ఫ్యామిలీ హీరోగా నిలబెట్టాయి. ముఖ్యంగా శ్రీకాంత్ అంటే మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ అలా అతి తక్కువ టైంలో వంద సినిమాలను కంప్లీట్ చేశాడు. అయితే హీరోగా ఎంతో ఫాస్ట్ గా ఎదిగిన శ్రీకాంత్ కెరీర్ అంతే ఒక్కసారిగా డౌన్‌‌ఫాల్ అయిపొయింది.

హీరోగా శ్రీకాంత్ కెరీర్ పీక్స్‌‌లో ఉన్నప్పుడు వచ్చిన సినిమాను వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇది శ్రీకాంత్ చేసిన ఫస్ట్ మిస్టేక్.. శ్రీకాంత్ కు ఉన్నది ఫ్యామిలీ హీరో అన్న ఇమేజ్.. ఈ ఇమేజ్‌‌ని పక్కన పెట్టి నిధి, ఇంగ్లిష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు అనే సినిమాలను చేశాడు శ్రీకాంత్. ఈ సినిమాలు శ్రీకాంత్ కు మైనస్‌‌గా నిలిచాయి.

ఇక తనకి పోటిగా ఉన్న వడ్డే నవీన్, జగపతిబాబు లాంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలను చేయడం శ్రీకాంత్‌‌కి ఓ రకంగా మైనస్ గా మారిందని చెప్పాలి. శ్రీకాంత్‌‌కు ఆఫర్లు తగ్గుతున్న టైమ్ లో వారుసల ఎంట్రీ కూడా శ్రీకాంత్ కెరీర్‌‌కి మైనస్‌‌గా మారిందని చెప్పాలి. ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా సినిమాలు చేసుకుంటూవెళ్తు్న్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here