జుట్టును సంరక్షించుకోవడానికి, పొడవుగా పెరగడానికి చాలా మార్గాలున్నాయి. తగు జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే అది పొందడం కూడా చాలా సులవే. అందులో ఒకటి ఏంటంటే.. తలకు పట్టించే షాంపులో కొన్ని పదార్థాలను కలపడం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
జుట్టు సంరక్షణ కోసం మహిళలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అందుకోసం మార్కెట్‌లో లభించే వివిధ నూనెలను పూయడం, హెయిర్ ప్యాక్ ఉపయోగించడం చేస్తూ ఉంటారు. వాటితో పాటు షాంపూలు కూడా వాడతారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ షాంపూలలో ఉండే కెమికల్స్ .. జుట్టును బలహీనంగా చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే జుట్టుకు పట్టించేకంటే ముందు షాంపూను కాస్త నీళ్లలో కలపాలి. ఇలా చేస్తే జుట్టు రాలదు.
ఉసిరి కాయ వల్ల చాలా లాభాలుంటాయన్న విషయం తెలిసిందే. దీని రసాన్ని షాంపూతో పాటు జుట్టుకు పట్టిస్తే ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
బృంగరాజ్ ఆకుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఆకుల రసాన్ని షాంపులో కలిపి జుట్టుకు రాస్తే జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తెల్ల జుట్టు సమస్యను కూడా పోతుంది.
చాలా మంది జుట్టులో చుండ్రు ఉన్నప్పుడు తలకు నూనె రాస్తూ ఉంటారు. ఇలా నూనె రాసుకోవడం వల్ల చుండ్రు శిరోజాలకు అతుక్కుపోయి విపరీతంగా పెరుగుతుందని కొందరు అంటున్నారు. కానీ చుండ్రు సమస్య ఉన్నవారు వేప రసాన్ని షాంపూలో రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
తలస్నానానికి ముందు జుట్టును గోరు వెచ్చని నీటితో తడపడం వల్ల తలపై ఉండే చర్మ కణాలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత జుట్టుకు షాంపూను అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి సహకరిస్తుంది.