పాలక్ పనీర్ చాలా మంది ఇష్టపడే రుచికరమైన భారతీయ వంటకం. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. పాలక్ పనీర్ లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. కానీ దీన్ని కొంతమంది వినాశకరమైనదిగానూ భావిస్తారు. వీటిలో ఆయుర్వేదం, సైన్స్ పేర్కొన్నట్లు అధిక యూరిక్ యాసిడ్ ఉంటుంది.
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వారు పాలక్ పనీర్ ఎందుకు తినకూడదు?
హరిద్వార్‌లోని బాబా రామ్‌దేవ్ ఆశ్రమానికి చెందిన స్వామి విదేహ్ దేవ్ చెప్పిన దాని ప్రకారం, అధిక యూరిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న వ్యక్తులు పాలక్ పనీర్ తినకూడదు. పాలక్ పనీర్ లో అధిక ప్రోటీన్ మూలాలు కలిగి ఉంటాయి. వీటిని కలిపినప్పుడు శరీరంలో ప్యూరిన్ స్థాయి పెరుగుతుంది. ఈ ప్యూరిన్.. రాళ్ల రూపంలో శరీరంలో చేరి యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే సమస్యలను పెంచుతుంది. ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల వల్ల కలిగే వచ్చే సమస్యను పెంచుతుంది. ఇది వాపు, నొప్పికి కూడా దారితీస్తుంది.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు పాలక్ పనీర్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ స్థాయిలు పెరగి శరీరానికో హాని కలిగిస్తుంది. ఇది నిలబడటం కూడా కష్టతరం చేస్తుంది. శరీర నొప్పులతో నిలకడ లేకుండా చేస్తుంది. ఇది మీ ప్రోటీన్ జీవక్రియను నాశనం చేస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే వారు పాలక్ పనీర్ తినడం మానుకోండి. ముతక ధాన్యాలు, కూరగాయలు, బొప్పాయి అధిక ఫైబర్ ఆహారాలు తినడంపై దృష్టి పెట్టండి. మొత్తంగా చెప్పాలంటే మీరు విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.