టుడే తెలుగు టాప్ న్యూస్​… హీరో కృష్ణ కన్నుమూత.. ఇంకా..

హీరో కృష్ణ కన్నుమూత

తెలుగు సినీ సూపర్ స్టార్ కృష్ట కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురై కాంటినెంటన్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. (పూర్తి వివరాలు)

హీరో కృష్ణ ఫైల్ ఫొటో

తెలంగాణలో 8 వైద్య కాలేజీలు..

తెలంగాణలో నేడు 8 కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ లో ఆయన ఈ కాలేజీలను ప్రారంభించి.. ప్రసంగించనున్నారు.

రాజగోపాల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు ఎండీగా ఉన్న సుశీ ఇన్ఫ్రా లో స్టేట్ జీఎస్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. పన్ను చెల్లింపుల్లో అవకతవకలను గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ కీలక నేతలపై ఇటీవల ఈడీ దాడుల తర్వాత జరిగిన ఈ సోదాలపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జనవరి, ఏప్రిల్ లో జేఈఈ మెయిన్

జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలను ఏప్రిల్ లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ

జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియాలోని బాలికి ప్రధాని మోదీ సోమవారం చేరుకున్నారు. ఇందన, ఆహార భద్రత తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.

సికింద్రాబాద్ నుంచి వందేభారత్ ట్రైన్

త్వరలోనే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందేభార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సాంకేతికంగా సాధ్యమైతే ట్రైన్ ను తిరుపతి వరకు పొడిగిస్తామన్నారు.

అమెజాన్ ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపు:

దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో 10 వేల మందిని తొలిగింపునకు సిద్ధం కాగా.. ట్విట్టర్ మరో 3 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసు:

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్ కు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ నోటీసులు ఇచ్చి విచరించే అవకాశం ఉంది.

ఈ రోజే తెలంగాణ గ్రూప్-1 కీ:

ఇటీవల నిర్వహించిన తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన తుది కీ ఈ రోజు విడుదల కానుంది. పలు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని తొలగించి ఫైనల్ కీని విడుదల చేయనున్నారు.

స్వల్ప నష్టాలతో..

సోమవారం అంతా ఒడుడొడుకుల నడుమ కదలాడిన సూచీలు, చివరికి స్పల్ప నష్టాలతో ముగిసాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు ఒత్తిడి ఎదురవడం ప్రతికూల ప్రభవాన్ని చూపింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here