అతిగా తీయడం మానేయండి
మీ కనుబొమ్మలను ఎక్కువగా తీయకుండా వాటిని ఎక్కువగా షేప్ చేయకుండా పెరగనివ్వండి.
సహజంగా ఉంచండి
మీరు కనుబొమ్మలను ఎక్కువ మందంగా పెరిగే అవకాశం ఉంటుంది.
అధిక ఒత్తిడిని నివారించండి
ఒత్తిడి సహజ జుట్టు పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల వాతావారణాన్ని కల్పించడానికి వ్యాయామం, ధ్యానం లాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి ఆ ప్రయత్నాల వైపు దృష్టి మరల్చండి.
ఫ్రొపెషనల్ ను సంప్రదించండి
మీ కనుబొమ్మల గురించి ఆందోళన చెందకుండా ఏదైనా సలహా కావాలనుకుంటే చర్మవ్యాధి నిపుణుడిని లేదా కనుబొమ్మల సంరక్షణలో నైపుణ్యమున్న ఎక్స్ పర్ట్ ను సంప్రదించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలను పాటించండి.
అధిక మేకప్ ను నివారించండి
పెన్సిల్, పౌడర్లు, జెల్స్ వంటివి కనుబొమ్మల మేకర్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి జుట్టు కుదుళ్లను మూసుకుపోయేలా, పెరుగుదలకు ఆటంకం కలిగించేలా చేస్తాయి.
సమతుల్య ఆహారం తీసుకోండి
విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లను తేమగా చేస్తుంది, పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెను కనుబొమ్మలకు అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి.
కనుబొమ్మలకు మసాజ్ చేయండి
మీ చేతివేళ్ల సాయంతో కనుబొమ్మలకు మసాజ్ చేయండి. వృత్తాకారంగా తిప్పుతూ సున్నితంగా మసాజ్ చేస్తే హెయిర్ ఫోలికల్స్ కు రక్త ప్రసరణలో సహాయపడుతుంది, జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.
ఆముదం
పడుకునే ముందు మీ కనుబొమ్మలకు ఆముదం రాయండి. నూనెలో హెయిర్ ఫోలికల్స్ కు పోషణ, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పోషకాలుంటాయి.