Homecinemaఈ సినిమాలకు ముందుగా అనుకున్న టైటిల్స్ ఇవే ..!

ఈ సినిమాలకు ముందుగా అనుకున్న టైటిల్స్ ఇవే ..!

ఏ సినిమాకు అయిన టైటిల్ చాలా ముఖ్యం.. టైటిలే సినిమాకు మంచి బజ్ ను తీసుకువస్తుంది. సినిమాకు ముందు ఓ టైటిల్ అనుకుని ఆ తరువాత మరో టైటిల్ ను ఫిక్స్ చేసి సినిమాను రిలీజ్ చేస్తారు మేకర్స్. ఒక్కోసారి తీసిన సినిమాకు పెట్టిన టైటిల్ కు సంబంధం కూడా ఉండదు. అది వేరే విషయం అనుకోండి. ముందుగా అనుకున్న టైటిల్ ను కాద‌ని ఆ త‌ర్వాత చేంజ్ చేసిన కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మిర్చి. ముందుగా ఈ సినిమాకు వార‌ధి అనే టైటిల్ పెట్టారు. కానీ టైటిల్ మరీ సాప్ట్ గా ఉందని మిర్చిగా మార్చారు.

ప‌వ‌న్ కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమాకు ముందుగా చెప్పాల‌ని ఉంది అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఆ తరువాత ఖుషిగా మార్చారు.

మ‌హేష్ బాబు, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఒక్కడు. అయితే ఈ సినిమాకు ముందుగా అత‌డే ఆమె సైన్యం అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత ఒక్కడుగా మార్చారు.

రామ్ చ‌ర‌ణ్ డెబ్యూ మూవీ చిరుత‌ సినిమాకు ముందుగాకుర్రోడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చిరు తనయుడుగా ఉండాలని ఆ తరువాత చిరుతగా మార్చారు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన చంద్రముఖి సినిమాకు ముందుగా నాగావల్లి అనే టైటిల్ అనుకున్నారు. ర‌జ‌నీకాంత్ సూచన మేరకు చంద్రముఖిగా మార్చారు.

నాగ‌చైత‌న్య హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా 100% ల‌వ్.ఈ సినిమాకు మొద‌ట్లో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి అనే టైటిల్ పెట్టారు. అయితే హీరోయిన్ కాన్సెప్ట్ గా టైటిల్ ఉందిని 100% ల‌వ్ గా మార్చారు.

ర‌వితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మిర‌ప‌కాయ్. ఈ సినిమాకు ముందుగా రొమాంటిక్ రిషి అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత టైటిల్ మరింత మాస్ గా ఉండాలని మిర‌ప‌కాయ్ గా మార్చారు.

మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఖ‌లేజా.ఈ సినిమాకు ముందుగా దేవుడు అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత ఖ‌లేజా మార్చారు.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. ఈ సినిమాకు ముందుగా సరదా అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత మనం చెప్పాల్సిన కథకు అత్తారింటికి దారేది అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని పవన్ చెప్పడంతో దానినే ఫైనల్ చేశారు.

ఇక ఈ మధ్య వచ్చి భారీ హిట్ కొట్టిన బలగం సినిమాకు ముందుగా కొమురయ్య అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత బలగంగా మార్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc