తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాపై కీలక ప్రకటన వచ్చింది. 2023 మే 25 గురువారం రోజున ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేయనున్నారు.
ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇక మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు. ఎంసెట్ ఫలితాల కోసం eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్ ను లాగిన్ అవొచ్చు.
మొత్తంగా ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 94.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,05,351 మందికి 1,95,275 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు.