సమంతను ముందుగా ఈ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారట

స్టార్ హీరోయిన్ సమంత తొలిచిత్రం ఏటంటే అందరూ ముందుగా చెప్పే సమాధానం. ‘ఏమాయ చేసావె’. అయితే ఈ సినిమా కంటే ముందు మరో సినిమాకు సమంత ఆడిషన్‌ ఇచ్చారట. ఈ విషయం చాలా మందికి తెలియదు. ‘మనీ’, ‘మనీ మనీ’, ‘సిసింద్రీ’ తదితర చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నాగేశ్వరరావు ముందుగా సమంతను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారట .

కానీ పారితోషికం ఎక్కువగా అడిగిదని, ఆ ఎఫెక్ట్ సినిమా బడ్జెట్ పై పడుతుందని ఆమెను హీరోయిన్ గా తీసుకోలేదట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. 2009లో కొత్త నటులతో ఆయన.. ‘నిన్ను కలిశాక’అనే టైటిల్ తో ఓ సినిమాను చేయాలనుకున్నారట శివ నాగేశ్వరరావు. అందులో భాగంగా ఆడిషన్స్ చేయగా అందులో సమంత కూడా ఆడిషన్‌ ఇచ్చిందట.

కానీ హీరోయిన్‌ పాత్ర చేయడానికి పారితోషికం ఎక్కువగానే అడిగిందట. దీంతో ఆయన ఆమెను పక్కన పెట్టారట. లేకపోతే తానే సమంతను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసేవాడినని తెలిపారు. సమంత తన ఆడిషన్‌ లో అద్భుతంగా పెర్ఫామ్‌ చేసిందని శివ నాగేశ్వరరావు తెలిపారు.

అలా మిస్ అయిన చాన్స్ సమంతకు ‘ఏమాయ చేసావె’ సినిమాతో దక్కింది. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలై సూపర్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రం తరువాత మళ్లి సమంత వెనుదిరిగి చూసుకుంది లేదు. తన తొలి చిత్రంలో కలిసి నటించిన హీరో నాగచైతన్యను సమంత పెళ్లి చేసుకున్నారు. 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టుగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇక నిన్ను కలిశాక చిత్రాన్ని సంతోష్, చైతన్య, ప్రియ, దీప షా, తరుణ్ కొత్త నటులతో శివ నాగేశ్వరరావు తెరకెక్కి్ంచారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించగా సునీల్ కశ్వప్ సంగీతం అందించారు. 2009 అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలైంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here