శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శతమానం భవతి. ప్రకాష్ రాజ్, జయసుధ, ఇంద్రజ, రాజా రవీంద్ర,రచ్చరవి కీలక పాత్రలు పోషించారు. 2017 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు. నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా రావడం విశేషం.
ఈ కథను 1990లోనే రాసుకున్నారు దర్శకుడు సతీష్ వేగేశ్న. పల్లె ప్రయాణం ఎటు అని ఆంధ్రప్రభ నిర్వహించిన ఒకే పేజీ కథల పోటీలో భాగంగా దీనిని రాశారు సతీష్ వేగేశ్న.అయితే అప్పుడు ఈ కథ తిరస్కరించబడింది. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేసి సినిమాగా తీయాలని సతీష్ వేగేశ్న అనుకుని నిర్మాత దిల్ రాజును కలసి వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ముందుగా ఈ కథను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ను అనుకున్నారు మేకర్స్. కథ కూడా సాయికు బాగా నచ్చడంతో ఒకే చెప్పాడు. కానీ దిల్ రాజు ఈ కథకు సాయి సెట్ అవ్వడని, రాజ్ తరుణ్ ను తీసుకుందామని అనుకున్నారు. కానీ రాజ్ తరుణ్ కథను రిజెక్ట్ చేయడంతో ఫైనల్ గా శర్వానంద్ అనుకున్నారు.
అఆ చిత్రంలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్రకు ముందగా రాఘవేంద్రరావును అనుకున్నారు కానీ ఆయన ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. మిక్కీ జె. మేయర్ సాంగ్స్ సినిమాకు చాలా ప్లస్ అయింది.