ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన చిత్రం హలో బ్రదర్. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.. అంతకుముందు వీరి కాంబోలో వారసుడు చిత్రం వచ్చి సూపర్ హిట్ అయింది. ఇక హలో బ్రదర్ నాగార్జునకు ఇదే మొదటి డ్యూయల్ రోల్ చిత్రం కావడం విశేషం . ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు.
1994లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇండస్ట్రీ హిట్ వరకు వెళ్లిందీ చిత్రం. ఇప్పటికి ఈ సినిమాను టీవీలో వస్తే నాగార్జున ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మాములు ఆడియన్స్ కూడా వదిలిపెట్టరు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు డూప్‌గా హీరో శ్రీకాంత్ నటించాడు. నాగార్జున హైట్ కు సరిగ్గా సరిపోవడంతో నాగార్జున డూప్ గా తీసుకున్నారు. ఈవీవీ సత్యనారాయణతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా నాగార్జునకు డూప్ గా నటించేందుకు శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. నాగార్జున ఓకే ఫ్రేమ్ లో కనిపించిన ప్రతిసారి వెనుకల నుంచి కనిపించేది శ్రీకాంతే.
ఈ సినిమా పైన నాగార్జునకు ఎందుకో మొదటినుంచీ అపనమ్మకం ఉండేదట. సినిమా విజయం సాధించదని, బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడం ఖాయమని అనిపిస్తుండేదట. ఒక్క ఈవీవీ సత్యనారాయణ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాను చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘హలో బ్రదర్’ సూపర్ హిట్ అయింది. 1994లో విడుదలైన చిత్రాల్లో ‘హలో బ్రదర్’ టాప్ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.