Homecinemaఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ‘నువ్వే కావాలి’

ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ‘నువ్వే కావాలి’

తరుణ్‌, రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నువ్వే కావాలి’. ఉషాకిరణ్‌ మూవీస్‌ పై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించగా కోటి సంగీతాన్ని అందించారు. మలయాళీ చిత్రం ‘నిరమ్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కి్ంచారు. ముందుగా ఈ చిత్రాన్ని చూసిన స్రవంతి రవికిషోర్‌ తెలుగులో ఈ చిత్రాన్ని చేయాలని అనుకున్నారు. దర్శకుడు విజయ్‌భాస్కర్‌కి కాల్‌ చేసి పిలిపించారు.

విజయ్‌భాస్కర్‌, త్రివిక్రమ్‌ను పిలిపించి .. ఇద్దరు కలిసి ‘నువ్వేకావాలి’ స్ర్కిప్ట్‌ను సిద్ధం చేశారు. నిరమ్‌’ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని, ఆ కథలోని సన్నివేశాలకు, తెలుగులో చాలా మార్పులు చేశారు. అయితే ఈ సినిమాను అంత బడ్జెట్ తో నిర్మించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఓ సందర్భంలో రామోజీరావు చెప్పిన మాటలు రవికిషోర్‌ కు గుర్తుకొచ్చాయి.

వెంటనే ఓ రోజు ఆయన్ని కలిసి విషయాన్ని చెప్పారు. మొత్తం సినిమా బడ్జెట్ పెట్టేందుకు రామోజీరావు రెడీ అయిపోయారు. ప్రోడక్షన్ వర్క్ మాత్రం రవికిషోర్‌ ను చూసుకోమన్నారు. దీంతో రవికిషోర్‌ లో ఫుల్ జోష్ వచ్చింది. ముందుగా మహేష్ బాబుతో ఈ సినిమాను చేయాలని అనుకున్నారు రవికిషోర్‌ .. ఆయనకు నిరమ్ చిత్రం చూడమని ప్రింట్ పంపితే రెండు నెలలయినా స్పందన రాలేదు. పవన్ ను అడిగితే కూడా నో రెస్పాన్స్ . దీంతో హీరో సుమంత్ తో ఈ సినిమాను చేద్దామని అనుకున్నారు.

కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడే బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక యాడ్ లో కనిపించాడు. ఇది చూసిన రవికిషోర్ నువ్వే కావాలి సినిమాకు అతను సరిగ్గా సరిపోతాడని అతన్ని ఒప్పించారు.

ఆ సినిమాకు తరుణ్ పారితోషికం 3 లక్షలు. ఇక హీరోయిన్ కోసం చాలా వెతుకులాట జరిగింది. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రిచా సరిపోతుందనిపించింది. రెండో హీరోగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయికిరణ్ ను తీసుకున్నారు.

ఈ చిత్రం అక్టోబరు 13, 2000 న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండీ ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్ర విజయంతో స్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc