హీరోయిన్ ఊహ మేనమామ తెలుగులో పెద్డ నటుడే.. ఎవరంటే ?

హీరోయిన్ ఊహ గుర్తింది కదా.. అదేనండీ హీరో శ్రీకాంత్ వైఫ్.. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘ఆమె’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఊహ. 1990 నుండి 1999 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినిమాలలో నటించింది ఊహ. నిజానికి ఊహ అసలు పేరు శివరంజని.

ఆమె సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు ఈవివి సత్యనారాయణ ఆమె పేరును ఊహాగా మార్చారట. ఈ సినిమా చేస్తున్న టైమ్ లోనే శ్రీకాంత్, ఊహ ప్రేమలోపడ్దారట. కొన్ని రోజుల తరవాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.కన్నడ సినిమా హృదయ సామ్రాజ్య సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది ఊహ. ఆ తర్వాత మలయాళం, తమిళ్ భాషల్లో నటించింది.

1994లో తెలుగులో దర్శకుడు ఈవివి ఊహకు హీరోయిన్ గా చాన్స్ ఇచ్చారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఆయనకి ఇద్దరు, ఊహ, ఆయనగారు మొదలగు సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఊహ. ఇక శ్రీకాంత్ తో పెళ్లి తర్వాతఆమె సినిమాలకి దూరంగా ఉంది .

ఊహకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆమె మేనమామ ఓ లెంజడరీ నటుడే…ఆయన మరెవరో కాదు పి.ఎల్. నారాయణ.. అయన అసలు పేరు పుదుక్కోటై లక్ష్మీనారాయణ.. ఈయన సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా, రంగస్థల నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లోకి వచ్చాక ఎక్కువగా సహాయ పాత్రలు చేశారు.

1992 లో యజ్ఞం అనే సినిమాలో అప్పలనాయుడుగా నటించారు. ఇందులోని అయన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు దక్కాయి. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు అందుకున్నారు.

ఎన్నో విలక్షమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అయన 1998 నవంబరు 3 న తన అరవై మూడో ఏట తుదిశ్వాస విడిచారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here