నోటిలో కలిగే వివిధ రుచులకు, వాసనలకు కారణాలివే..

ఒక్కోసారి మనం రోజూ తినే ఆహారమే అయినా రుచిని కలిగించదు. కొన్ని సార్లు మాత్రం చాలా రుచిగా అనిపిస్తుంది. వెల్లుల్లి, ఉల్లిపాయల వంటి ఎక్కువ వాసన వచ్చే ఆహారాలు రుచిని తీసివేస్తాయి. చాలా మంది మౌత్ ప్రెషనర్ల సహాయంతో పళ్లు తోముకోవడం, నోటిని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అయినప్పటికీ కొందరిలో మాత్రం ఆ సమస్యలు పోవు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అలా నోటిలో చెడు వాసనలున్నట్టయితే దానికి ప్రత్యేక చేయవలసి ఉంటుంది. వాటిని ఏ కారణంతోనూ విస్మరించరాదని వైద్యులు చెబుతున్నారు.

చేదు

  • హార్మన్లలో మార్పులు
  • ఒత్తిడి
  • మెనోపాజ్
  • నరాల వీక్ నెస్

    ఈ పరిస్థితిని డైస్గ్యూసియా అని పిలుస్తారు. సాధారణంగా ఈ పరిస్థితి చాలా అసహ్యకరమైంది. చాలా కాలం పాటు కొనసాగుతుంది. దీని వల్ల అనారోగ్యంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.

తీపి రుచి

మధుమేహం, శరీరంలో అధిక చక్కెర స్థాయిలు ఉన్న వారిలో నోరు ఎప్పుడూ తీపిగా అనిపిస్తుంది. దీన్ని నియంత్రించకపోతే డయబెటిక్ కీటోయాసిడోసిస్ అని పిలవబడే తీవ్రమైన సమస్యకు దారి తీయవచ్చు. శరీరంలో కీటోన్లు పేరుకుపోవడం వల్ల తీప వాసన వస్తుంది.

తీపి వల్ల వచ్చే లక్షణాలు

  • దాహం పెరగడం
  • తరచూ మూత్ర విసర్జన
  • మసక దృష్టి
  • గందరగోళం
  • అలసట
  • వికారం, వాంతులు
  • పొత్తికడుపు తిమ్మిరి

పులుపు

వివిధ ఆరోగ్య పరిస్థితుల కారణంగా నోరు పుల్లగా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల నోరు ఎండిపోయినట్టుగా, ఆందోళనగా అనిపిస్తుంది.

సిగరెట్ తాగడం

ఇది నోటిలో చెడు రుచిని, వాసనను కలిగిస్తుంది

డీహైడ్రేషన్

రోజంతా నీరు లేదా ఇతర ఎలాంటి ద్రవాలు తీసుకోకపోవడం వల్ల నోరు పొడిగా మారుతుంది. దీని వల్ల నోరు ఉప్పుగా మారుతుంది. కాబట్టి రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణం వేడిగా ఉంటే ఈ పరిమాణాన్ని కూడా పెంచవచ్చు. ఇది అధికమైతే మూర్ఛలు, అలసట, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here