ధాన్యాలు
ధాన్యాలు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమని వాదించినప్పటికీ అల్పాహారంగా శుద్ది చేసిన, అధిక స్థాయిలో కార్బో హైడ్రేడ్స్ ఉన్న తృణ ధాన్యాలను తీసుకోవడం అనారోగ్యానికి దారి తీస్తాయి.
సాసేజ్లు
సాసేజ్లను సాధారణంగా క్లాసిక్ ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్టులుగా పేర్కొంటారు. ఈ ఫుడ్ లో సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ లు ఎక్కువగా ఉన్నందున అల్పాహారంగా ఇది ఉత్తమ ఎంపిక అనిపించుకోదు.
మఫిన్లు
ఫైవ్ స్టార్ హోటల్స్ లో బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ లలో లభించే ఐటెమ్స్ లలో మఫిన్స్ కూడా ఒకటి. ఇందులో అధిక క్యాలరీ కంటెంట్ ఉండడం వల్ల ఇది అత్యుత్తమ అల్పాహార ఎంపిక కాదు.
పండ్ల రసాలు
ప్యాక్ చేయబడిన వివిధ రకాల పండ్ల రసాలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం సురక్షితం కాదు. ఇందులో ఎక్కువ కేలరీలు ఉండడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు అస్సలు సురక్షితం కాదు.
వాఫ్పల్స్
తాజాపండ్లు, బెర్రీలు, తేనె కలిపిన వాఫ్పల్స్ చాలా అనారోగ్యకరం. వీటిని అల్పాహారంగా అస్సలు అంటే అస్సలుకే తీసుకోరాదు.
పెరుగు
పెరుగు అనే ఆరోగ్యాన్ని మెరుగుపర్చే ఐటెం. కానీ ఇందులో చక్కెర ఆరోగ్యానికి హాని చేస్తుంది.
గ్రానోలా
సాధారణంగా అల్పాహారంగా తృణధాన్యాలను తీసుకోకూడదని ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ ఇందులో ఉండే బెర్రీలు అద్భుతమైన అల్పాహర ఎంపిక అని చెప్పవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్పాహారంగా చాక్లెట్ తింటే మంచిది.