పని ఒత్తిడి, సమయం లేకపోవడం, అస్తమానం టీవీలు, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇవి రావడానికి కారణాలేమైనా గానీ.. వీటిని తగ్గించడానికి మాత్రం చాలా మార్గాలున్నాయి. హాస్పిటల్ కు వెళ్లకుండానే, కేవలం ఇంట్లో ఉండే, సులభంగా లభించే ఆహారాలతో ఈ నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ సి
కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు స్ట్రాబెర్రీస్, కివీ, బెల్ పెప్పర్స్ తినడం వల్ల విటమిన్ సి లభిస్తుంది.
విటమిన్ కె
రక్త గడ్డ కట్టడంలో విరిగిన రక్తనాళాల వల్ల ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఆకుకూరలు, బ్రోకలీ, బ్రసెల్స్ తినడం వల్ల ముఖానికి విటమిన్ కె లభిస్తుంది.
విటమిన్ ఇ
విటమిన్ ఇ చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. గింజలు, బచ్చలి కూర, అవకాడోలో విటమిన్ ఇ లభిస్తుంది.
విటమిన్ బి12
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, రక్తహీనత వల్ల ఏర్పడినన్నటి వలయాలకు విటమిన్ బి 12 సహాయపడుతుంది. చేపలు, మాంసంలలో ఇది ఎక్కువగా ఉంటుంది.
ఇనుము
ఆరోగ్యకరమైన రక్తప్రసరణకు, రక్తహీనతకు ఇది చాలా అవసరం. ఐరన్ రిచ్ ఫుడ్స్ అయిన బీన్స్, బచ్చలి కూర, బలవర్ధకమైన తృణధాన్యాల్లో ఇనుము సమృద్ధిగా లభిస్తుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు
చర్మం పోషణ, వాపు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అవిసె గింజలు. చియా గింజలు తీసుకోవడం వల్ల ఒమేగా 3 లభిస్తుంది.
జింక్
కొల్లజెంట్ సంశ్లేషణ గాయాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది. గుడ్డు, మాంసం, గుమ్మడి గింజలు, కాయ దాన్యాలలో జింక్ అధికంగా ఉంటుంది.
యాoటీ ఆక్సిడెంట్లు
డార్క్ చాక్లెట్, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి.
హిలురోనిక్ యాసిడ్
చర్మంలో తేమను నిలుపుకోవడంలో, నల్లటి వలయాలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. ఆకుకూరలు, సోయా ఉత్పత్తుల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది.
హైడ్రేట్ గా ఉండడం తప్పనిసరి
ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి హైడ్రేట్ గా ఉండడం చాలా అవసరం. అధికంగా నీరు త్రాగడం వల్ల నిర్జలీకరణాన్ని నివారించడంలో సహాయపడుతుంది.