ఒకే కథతో సినిమా చేసిన ఇద్దరు స్నేహితులు

సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ బ్లాక్ బస్టర్ నాట్టమై హక్కులును కొనిపించి దానిని పెద్దరాయిడు సినిమాగా తెరకెక్కెంచి, అందులో పాపారాయిడు అనే పవర్ ఫుల్ పాత్రను రూపాయి రెమ్యూనరేషన్ లేకుండా చేశారు రజినీ. ఈ సినిమా తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయింది. అప్పటివరకు అప్పుల్లో ఉన్న మోహన్ బాబు ఈ సినిమాతో మళ్లీ లాభాల్లోకి వచ్చారు. ఇలాంటి ఈ ఇద్దరు స్నేహితులు ఒకే కథతో ప్రేక్షకులను మెప్పించారు. అదే అల్లరి మొగుడు, వీరా.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992లో అల్లరి మొగుడు చిత్రం తెరకెక్కింది. మోహన్ బాబు సరసన రమ్యకృష్ణ, మీనా హీరోయిన్లుగా నటించారు. సత్యానంద్ తో స్క్రిప్ట్ రాయగా, స్వీయ దర్శకత్వంలో రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి పాటలు అందించిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా రిలీజైప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుని ఏకధాటిగా వందరోజులు ఆడేసింది.

అయితే ఈ సినిమాను తమిళ్ లో నువ్వు చేస్తే బాగుంటుందని రజినీకాంత్ కు సూచించారు మోహన్ బాబు. దీంతో రజినీకాంత్ దర్శకుడు సురేష్ కృష్ణకు ఆ బాధ్యతను అప్పగించారు. ఒరిజినల్ వెర్షన్ లో మీనాను మాత్రమే తీసుకుని మిగిలిన క్యాస్టింగ్ ని మార్చేశారు. రమ్యకృష్ణ స్థానంలో రోజా వచ్చింది. టైటిల్ వీరగా నిర్ణయించారు. 1994 లో రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. కొంత కాలం తర్వాత మళ్ళీ దీనినే తెలుగు ప్రేక్షకుల కోసం అదే టైటిల్ తో డబ్బింగ్ చేశారు.

ఇక ఇదే చిత్రాన్ని కన్నడలో గదిబిడి గండ పేరుతో రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవిచంద్రన్ సరసన రమ్య కృష్ణ, రోజా హీరోయిన్లుగా నటించారు. 1993లో రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కన్నడలో రోజాకు మొదటి చిత్రం కావడం విశేషం. ఇక హిందీలో 1996లో సాజన్ చలే ససురాల్ పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రంలో గోవింద , టబు , కరిష్మా కపూర్ నటించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం విశేషం.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here