విడాకులకు ‘ఆహ్వానం’ పలికిన ఎస్వీ కృష్ణారెడ్డి

వినూత్నమైన కథలు చేయడంలో దర్శకుడు ఎస్.వీ.కృష్ణారెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగా ఆయన తెరకెక్కించిన చిత్రం ఆహ్వానం శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా రాజగోపాల్ కీలక పాత్రాల్లో నటించిన ఈ సినిమా 1997 మే 02న రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. భార్యాభర్తలు విడిపోవడం అనేది సర్వసాధారణంగా మారిపోతున్న తరుణంలో వివాహ బంధంలోని గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఈ సినిమాను రూపొందించారు.

వాస్తవానికి ఇదేం ఒరిజినల్ స్టోరీ ఏం కాదు. 1959లో అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన పెళ్లినాటి ప్రమాణాలు సినిమాకు రీమేక్ గా చెప్పొచ్చు. భార్య పట్ల అయిష్టత పెంచుకున్న హీరో తన సెక్రటరీ వైపు ఆకర్షితుడై విడాకుల ద్వారా కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటాడు. దీనినే కొద్దిగా మార్పులు చేసి ఇప్పటి తరానికి అర్థమయ్యేలా తీయాలనే రూపొందించారు. దివాకర్ బాబు ఈ చిత్రానికి మాటాలు రాశారు.

అగ్ర హీరోలతో మాత్రమే సినిమాలు తీసిన నిర్మాత త్రివిక్రమరావు ఈ సినిమాను నిర్మిస్తున్నాని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కథ బాగా నచ్చిన ఆయన ఎక్కువ ఆలోచించలేదు. ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీత అందించిన ఈ సినిమాలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర రాశారు. ఈ సినిమాకు గానూ స్పెషల్ జ్యూరీ అవార్డును – ఎస్.వి.కృష్ణారెడ్డి అందుకున్నారు.

నిరుద్యోగి అయిన రవికుమార్ (శ్రీకాంత్) డబ్బు పిచ్చి గల మనిషి. కష్టపడకుండా ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు. దానికి మార్గం బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసుకొని పెళ్ళి చేసుకోవడమేనని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో సిరిపురం సత్యనారాయణ (కైకాల సత్యనారాయణ) తన కూతురు రాజేశ్వరి (రమ్యకృష్ణ)కి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడని, కట్నంగా పాతిక లక్షలు ఇవ్వగలడని తన బాబాయి శలభయ్య (సాక్షి రంగారావు) ద్వారా తెలుసుకొని ఆయన సిఫార్సు చేసిన ఉద్యోగంలో చేరాలనుకుంటాడు. ఉత్తరం తారుమారు అవ్వడంతో సిరిపురంలో వంటవాడి అవతారం ఎత్తాల్సివస్తుంది రవికి.

ఆ తరువాత సత్యనారాయణ దృష్టిని ఆకర్షించి, శలభయ్య ద్వారా నిజం తెలిశాక రాజేశ్వరిని పెళ్ళాడతాడు రవి. శిరీష (హీరా) అనే కోటీశ్వరురాలు ఉద్యోగరీత్యా రవిని కలిసి, ఆ తరువాత అతడిపై మనసుపడుతుంది. ఆవిడ ఆస్తి పట్ల ఆకర్షితుడైన రవి తన భార్య రాజేశ్వరికి విడాకులు ఇవ్వడానికి పూనుకొని రాజేశ్వరికి నోటిసులు పంపుతాడు. ఆ తరువాత రాజేశ్వరి తన భర్త మనసును మార్చి తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకున్నది అనేది ఈ సినిమా కథ

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here