కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో విటమిన్లు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు చాలా ఉంటాయి. సహజంగా లభించే కొబ్బరి నూనె జుట్టు పొడవుగా, మందంగా, వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఆర్గన్ నూనె
ఆర్గాన్ ఆయిల్ లో కొవ్వు ఆమ్లాలతో పాటు, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది తలలోని చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది.
జోజోబా నూనె
జోజోబా ఆయిల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. దీంట్లో జుట్టు సంరక్షణకు ఉపయోగపడే ఒలిక్, బెహెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
ఆలివ్ నూనె
ఆలివ్ ఆయిల్ జుట్టు కుదుళ్లను బలంగా ఉండేలా చేస్తుంది. ప్రతీ వెంట్రుక బలంగా ఉండేలా, ఆయుష్షును పెంచేలా చేస్తుంది. జుట్టు వేగంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
ఆముదం
ఆముదం సాధారణం కంటే మూడు నుంచి ఐదు రెట్లు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
బాదం నూనె
విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉండేందుకు, చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది.
రోజ్మేరీ నూనె
రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ద్రాక్ష గింజల నూనె
గ్రేప్ సీడ్ ఆయిల్ లో పోషకాలు, ప్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ఉత్తేజపరుస్తుంది.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. స్కాల్ప్ ఆరోగ్యంగా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
లావెండర్ నూనె
లావెండర్ నూనె జుట్టులో ఉండే సూక్ష్మజీవులు, వివిధ బాక్టీరియాలను నశింపజేస్తుంది.