ఎక్కువ ఫైబర్ తినండి
పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లు వంటి అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని రోజూవారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
హిట్ ప్రాక్టీస్ చేయండి
హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల తక్కువ వ్యవధిలో ఎక్కువ కేలరీను బర్న్ చేయొచ్చు. దీని వల్ల మంచి ఫలితాలుంటాయి.
ఎక్కువ ప్రోటీన్లు తీసుకోండి
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇవి కండరాలను బలంగా ఉంచుతాయి.
కాలరీలను తగ్గించండి
బరువు తగ్గడానికి, పొట్ట భాగంలో ఉండే కొవ్వును తగ్గించడానికి ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగండి
మెరుగైన ఆరోగ్యానికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో.. నీరూ అంతే ముఖ్యం. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. పొట్ట భాగాన ఉండే కొవ్వును తగ్గిస్తుంది.
బాగా నిద్రపోండి
ఏ వయసులోనైనా బరువు పెరుదలకు నిద్ర తప్పనిసరి. ఇది 50వ దశకంలో ఇన్సులిన్, జీవక్రియను అదుపులో ఉంచుతుంది. ప్రతి రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా పోవాలి.