చాలా మంది తల్లులు బిడ్డ పుట్టిన తర్వాత మానసిక స్థితిలో మార్పులను అనుభవిస్తారు. ప్రసవం అనే అద్భుతాన్ని అనుభవించిన తర్వాత కూడా తమకెందుకు దుఃఖం, చిరాకు, ఆత్రుత వగైరా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే, ఇది కేవలం ఆమె శరీరం శారీరక, హార్మోన్, మానసిక మొదలైన మార్పుల పరిణామంలో భాగమే. ఇది సాధారణంగా రెండు వారాల పాటు కొనసాగుతుంది. ఈ ప్రవర్తన రెండు వారాల కంటే ఎక్కువ కాలం పొడిగించినప్పుడు మాత్రమే దీన్ని సమస్యగా పరిగణించవచ్చు. తల్లి రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే డిప్రెషన్‌ను వైద్యపరంగా ప్రసవానంతర డిప్రెషన్‌గా గుర్తిస్తారు.
ప్రసవానంతర డిప్రెషన్ సంకేతాలు:
* పిల్లలతో బంధం కష్టంగా అనిపించడం
* ఆకలి లేకపోవడం
* విపరీతమైన ఏడుపు
* నిద్ర
* విపరీతమైన అలసట
* స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండడం
* తీవ్రమైన మానసిక కల్లోలం
* పనులపై ఆసక్తి తగ్గడం
* మంచి తల్లి కాదనే భయం
* తీవ్రమైన చిరాకు
* తీవ్రమైన ఆందోళన
* భయాందోళనలు
* అపరాధ భావన, ఏవో అనుమానాలు
ఇలాంటి చాలా సంకేతాలు డిప్రెషన్ కు దారితీస్తాయి. ఇది నెలలు, కొన్నిసార్లు ఒక సంవత్సరం కూడా కొనసాగవచ్చు. ఇది పిల్లల సంరక్షణను నిర్లక్ష్యం చేయడానికి కూడా దారితీయవచ్చు. అందుకే మీరు ఈ సంకేతాలను విస్మరించకుండా వెంటనే వైద్యుడిని సందర్శించడం చాలా ముఖ్యం.
వైద్యుడి దగ్గరికి వెళ్లడంతో పాటు, మీరు చేయగలిగినవి ఏంటంటే:
* మీ కోసం కొంత సమయాన్ని వెచ్చించండి
* మీరు నమ్మే కనీసం ఒక వ్యక్తితో మీ అనుభూతిని పంచుకోండి
* క్రమం తప్పకుండా నిద్రపోవడం
* మీ కుటుంబం, భాగస్వామి, స్నేహితులపై ఎక్కువగా ఆధారపడటం
* ఆరుబయట అడుగు పెట్టడమే పనిగా పెట్టుకోవడం
ప్రసవానంతర వ్యాకులత మిమ్మల్ని అపరాధ భావాన్ని లేదా ఏదో చెప్పుకోలేదని బాధను కలిగిస్తుంది. అయితే, మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఇది మీరు నియంత్రించగలిగేది కాదు. శిశువు మీ జీవితంలో అపారమైన మార్పులను తెస్తుంది. కాబట్టి మార్పును అంగీకరించడానికి కొంత సమయం తీసుకోవడం చెడ్డ విషయం కాదు. మీరు మీ ప్రవర్తనను గమనించి, అవసరమైతే ఇతరుల సహాయం పొందడం ఉత్తమం.