ఈ ఫొటో వెనుకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే?

ఒక హీరో సినిమా ప్రారంభోత్సవానికి మరో హీరో చీఫ్ గెస్టుగా రావడం కామన్.. కానీ చిరంజీవి నటించిన ఓ సినిమాకు మాత్రం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు చీఫ్ గెస్టులుగా వచ్చారు. అదే ఖైదీ నంబర్ 786. చిరంజీవి హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కి్ంది.

ఇందులో చిరు సరసన భానుప్రియ హీరోయిన్ గా నటించింది. రాజ్ – కోటి మ్యూజిక్ అందించారు. 1988 జూన్ 10న రిలీజైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ షూటింగ్ 1987 అక్టోబర్‌ 25న వాహినీ స్టూడియోలో మొదలైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముగ్గురు అగ్ర హీరోలు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు హాజరయ్యారు.

ఈ హీరోలందరితో విజయబాపినీడుకు మంచి రిలేషన్స్ ఉండడం వల్లే ఈ కల సాధ్యమైంది. చిరంజీవి, భానుప్రియపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కృష్ణంరాజు కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా, శోభన్‌బాబు తొలి క్లాప్ ఇచ్చారు. హీరో కృష్ణ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

ప్రతి సినిమాకు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఉన్నట్లేగానే ఈ సినిమా శత దినోత్సవాన్ని ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు దర్శకుడు విజయబాపినీడు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc