దేశభక్తి కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఖడ్గం. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి నిర్మించారు. ఉత్తేజ్, సత్యానంద్ స్ర్కీన్ ప్లే, మాటలు రాశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నవంబరు 29, 2002 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఐదు నంది పురస్కారాలను అందుకుంది.
అయితే ఈ సినిమాను ముందుగా స్టార్ హీరోలతోనే తీయాలని అనుకున్నారు కృష్ణవంశీ. కానీ అందరినీ ఒప్పించడం కష్టమని తెలిసి మిడియం రెంజ్ హీరోలతో సినిమాను ప్లాన్ చేశారు కృష్ణవంశీ. ముందుగా శ్రీకాంత్ పాత్ర కోసం హీరోలు నాగార్జున, వెంకటేష్ లను అనుకున్నారు. ఆ తరువాత శ్రీకాంత్ ను ఒకే చేశారు. కానీ అప్పటికి ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నశ్రీకాంత్ ను కాకుండా మరో స్టార్ హీరోను తీసుకుందామని సుంకర మధుమురళి అనుకున్నారు. అందుకు కృష్ణవంశీ ఒప్పుకోలేదు.
ఇక సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు కృష్ణవంశీకి బెదిరింపులు ఎక్కువయ్యాయి. చంపేస్తామని హెచ్చరించారు కూడా దీంతో కొన్ని రోజుల పాటు కృష్ణవంశీ ఎవరికీ బయట కనిపించలేదు కూడా. హీరో శ్రీకాంత్ కు కూడా బెదిరింపులు వచ్చాయి. అయినప్పటికీ ఎవరికీ భయపడలేదని, కొన్ని రోజులు జేబులో గన్ పెట్టుకుని తిరిగానని శ్రీకాంత్ వెల్లడించారు. ఈ చిత్రం హిందీలోకి మార్తే దామ్ తక్ పేరుతో , తమిళంలోకి మాణిక్ బాషాగా , భోజ్‌పురిలోకి బేమిసాల్ హై హమ్ పేరుతో డబ్ చేయబడింది .