డ్యాన్స్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ యాంగ్రీ యంగ్‌మెన్‌

ఇప్పుడంటే రాజశేఖర్ ఫెడౌట్ హీరో కానీ ఒకప్పుడు పోలీసు పాత్రల్లో అద్భుతంగా నటించి బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన హీరో. అప్పట్లో ఆయన్ను అందరూ ‘యాంగ్రీ యంగ్‌మెన్‌’గా పిలుచుకునేవారు. అలాంటి రాజశేఖర్ తో లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ చేసేందుకు 1993లో సిద్దమయ్యారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. అదే అల్లరి ప్రియుడు.అప్పట్లో ఇదో విచిత్రమైన కాంబినేషన్. హీరో రాజశేఖర్ కూడా ఊహించని కాంబినేషన్ అంటే అర్థం చేసుకొండి మరి.

చాలా మంది ఇది రిస్క్ అన్న సరే రాఘవేంద్రరావు మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. రాజశేఖర్ సరసన రమ్యకృష్ణ, మధుబాల హీరోయిన్లుగా తీసుకున్నారు, ఆర్. కె. ఫిల్ం అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత అందించారు. ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రోస్ రోస్ రోస్ రోజాపువ్వా, అందమా నీ పేరేమిటి, ఉత్తరాల ఊర్వశి, అహో ఒక మనసుకు నేడే -పాటలకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.

అల్లరి ప్రియుడు అంటే ముందుగా పాటలు గుర్తుకు వస్తే అ వెంటనే గుర్తుకు వచ్చేది రాజశేఖర్ డాన్సే. ఈ సినిమాలో ఆయన వేసిన స్టేప్స్ చాలా ఫేమస్ అయిపోయాయి,రాజశేఖర్ డాన్స్ మార్క్ అయిపోయాయి ఆ స్టేప్స్. ఈ సినిమాలో ఆ స్టేప్స్ వేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారట.

‘‘ప్రభుదేవా చేసి చూపించిన స్టెప్‌లు వేయలేకపోయేవాడిని. దీంతో నా బాడీకి సరిపోయేలా స్టెప్‌లను ప్రభుదేవా చేసి చూపించేవారు. కొన్ని సార్లు అవికూడా చేయలేకపోయేవాడిని. అయినా, ప్రభుదేవా ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదు. తన సహాయకులకు, సైడ్‌ డ్యాన్సర్లకు ఒక సలహా ఇచ్చారు. ‘ఆయన(రాజశేఖర్‌) ఏది చేస్తే దాన్ని ఫాలో అవ్వండి’ అని చెప్పారట. నన్ను ‘డాక్టర్‌ మైకేల్‌ జాక్సన్‌’ అని సరదాగా పిలిచేవారు’’ అంటూ రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here