మహిళలకు రోగ నిరోధక శక్తిని పెంచే 5 ఆహారాలు

కుటుంబంలో కీలక పాత్ర పోషించే మహిళలు.. తమ ప్రియమైన వారిని చూసుకున్నంతగా తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో అనవసరమైన ఆరోగ్య సమస్యలను ఆహ్వానిస్తారు. స్త్రీ శరీరం పురుషుడి కంటే ఎక్కువ సున్నితంగా ఉంటుంది. కాబట్టి మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా కీలకం.

నానావతి మాక్స్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ డైటీషియన్ డాక్టర్ రసిక మాథుర్ ప్రకారం, మహిళల రోగనిరోధక శక్తిని పెంచడం అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఆడవారిలో వ్యాధులను నివారించడంలో సహాయపడే 5 రకాల ఆహారాలను ఆమె సూచించారు.

1) కూరగాయలు, సిట్రస్ పండ్లు

డాక్టర్ రసిక మాథుర్ ప్రకారం, ఆకుపచ్చ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మహిళలందరూ ప్రతిరోజూ కనీసం రెండు మూడు రకాల కూరగాయలు, సిట్రస్ పండ్లను తినాలని సూచించారు. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, జామూన్, ద్రాక్ష, నారింజ, కివీ వంటి సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

2) సలాడ్

ఫైబర్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. మీ పేగు ఆరోగ్యంగా ఉంటే, మెదడు కూడా మెరుగ్గా పని చేస్తుంది. అంతేకాకుండా, ఫైబర్ అనారోగ్యకరమైన ఆహారం చెడు ప్రభావాలను తొలగిస్తుంది.

3) విత్తనాలు

స్త్రీలు, పురుషులు జీవశాస్త్రపరంగా చాలా భిన్నంగా ఉంటారు. కాబట్టి, పురుషుల కంటే ఆడవారు ఎక్కువ విత్తనాలు తీసుకోవాలని సూచించారు. వాటిలో డైటరీ ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ముఖ్యమైన అంశం. గుమ్మడికాయ, లిన్సీడ్, రాగి, జొన్న, మిల్లెట్స్ లో ప్రతి రోజు ఒక రకమైన గింజలను తీసుకోవాలని సలహా ఇచ్చారు.

4) పాల ఉత్పత్తులు

మనందరికీ ప్రతిరోజూ గరిష్టంగా ప్రోటీన్ అవసరమని, పాల ఉత్పత్తులు కూడా ఆహారంలో భాగం కావాలని డాక్టర్ రసిక మాథుర్ అభిప్రాయపడ్డారు. భోజనంలో పాలు, పెరుగు లేదా మజ్జిగతో సహా ప్రత్యామ్నాయాలు ఉండాలి. పాలకు బదులుగా పప్పు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది దానికి సమానమైన ప్రయోజనకరిగా ఉంటుంది.

5) గింజలు

గింజల్లో పోషక విలువలుంటాయని మనందరికీ తెలుసు. బాదం ముఖ్యంగా రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. బాదంపప్పులు, వాల్‌నట్‌లు, ఆప్రికాట్లు, ఎండిన ఖర్జూరాలను తినడం వల్ల రోగనిరోధక శక్తిని పొందవచ్చు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here