ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో.. మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. మనలో చాలా మంది సమస్యలను పరిష్కరించుకోవడానికి తమ జీవనశైలిని మార్చుకోవడానికి బదులు మందులు తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. మనం ఎంత బాగా నిద్రపోతే.. చేసే పనుల్లోనూ అంతే ఫలితం దక్కుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఆ ప్రభావం చేసే పనులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది తెలియకుండానే మన ఆరోగ్యంపైనా ఎఫెక్ట్ పడుతుంది.
పడుకునే ముందు స్క్రీన్‌ల వాడకం..:
చాలా మంది పడుకునే ముందు ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లతో గడుపుతూ ఉంటారు. ఈ టెక్నాలజీ వచ్చాక అది మరింత ఎక్కువైంది. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని ఎప్పుడైనా ఆలోచించారా?
స్ర్కీన్ పైన ఉండే కాంతి కళ్లపై పడి.. అది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. వీటికి తోడు చాలా మంది నిద్ర పోయే ముందు టీవీ చూడడం చేస్తుంటారు. కానీ ఇది కూడా ఓ రకంగా ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఎంతో మంది నిద్రకు దూరమై.. అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి, మంచి నిద్ర పొందడానికి, మీరు పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం మంచిది. దానికి బదులుగా పుస్తకాలు లేదా పత్రికలు చదవడం ఉత్తమం.
పడుకునే ముందు వర్కవుట్..: వ్యాయామం తప్పనిసరి, కానీ పడుకునే ముందు కష్టపడి పని చేయడం మంచిది కాదు. కాలక్రమేణా, ఇది నిద్ర సమయాన్ని, నాణ్యతను తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని శక్తి నిల్వలను తగ్గిస్తుంది. కాబట్టి నిద్రకు ముందు వ్యాయామం చేయడానికి బదులుగా యోగా చేయడం ప్రయత్నించండి.
పరుపుల రకం:
నిద్ర లేమికి కారణం పరుపుల రకం లేదా పడక కూడా కారణమవుతంది. సరైన ప్రాంతం లేదా పరుపు లేదా పడక లేకపోతే.. నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీని వల్ల శరీరంలోని వివిధ భాగాలకు నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి ఎంచుకునే పరుపుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇటీవలి కాలంలో వస్తోన్న స్మార్ట్ గ్రిడ్ మాట్రెస్(SmartGRID Mattress)ఇతర పరుపులకు భిన్నంగా, మనం నిద్రిస్తున్నప్పుడు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, చెమటలను నివారిస్తుంది. అంతే కాకుండా ఇది మన శరీర ఆకృతికి అనుగుణంగా ఉంటుంది, వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది.
నిద్ర వేళలో కెఫిన్ వినియోగం:
చాలామందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. కాఫీ వినియోగం నిద్రపోకుండా చేస్తుంది. ఇది మనకు మెలకువగా ఉండడానికి శక్తిని అందిస్తుంది. కాబట్టి రాత్రి సమయాల్లో కాఫీ, టీ వంటి కెఫిన్ ఉన్న పదార్ధాలకు దూరంగా ఉంటే మంచిది.
వాతావరణం: మంచి నిద్ర పోవడానికి వాతావరణం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కోసారి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అధిక ఉబ్బరం, అధిక చల్లదనం కాకుండా సాధారణ ఉష్ణోగ్రత ఉండే వాతావరణం నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఒక్కోసారి మన పక్కన ఎవరైనా గట్టిగా అరుస్తున్నా.. మాట్లాడుతున్నా కూడా నిద్రపోవడం కష్టం. కాబట్టి పడుకునే గది, వాతావరణం నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవడం మంచిది