‘చంటి’ సినిమాకు ముందుగా అనుకున్న హీరో, హీరోయిన్లు ఎవరంటే?

విక్టరీ వెంకటేష్ కు ఎక్కువ హిట్లు రీమేక్ ల నుంచే ఉన్నాయి. ఆందులో ఒకటి చంటి. తమిళ్ లో వచ్చిన చిన్నతంబి చిత్రానికి ఇది రీమేక్. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఇందులో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా నటించింది.

వాస్తవానికి ఈ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో, హీరోయిన్లు వేరువేరు. తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన చిన్న తంబి సినిమా రీమేక్ హక్కులను నిర్మాత కె. ఎస్. రామారావు కొనేశారు. వెంకటేష్ తో తీయాలని అనుకున్నారు. అంతకుముందు ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు . బి.గోపాల్ తన దర్శకత్వంలో బాలకృష్ణతో ఈ సినిమాని తీయాలని భావించారు. కానీ బాలకృష్ణ ఎందుకో సినిమాను చేసేందుకు ఆసక్తిని చూపించలేదు.

ఇక రవిరాజా పినిశెట్టి అయితే ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ అయితే సరిగ్గా సరిపోతారని భావించి ఆయనతో సినిమాకు కమిట్ అయ్యారట. కానీ ఫైనల్ గా వెంకటేష్ తో సినిమాను చేశారు. చిన్నతంబిలో నటించిన ఖుష్బూనే తెలుగులో వెంకటేశ్‌ సరసన తీసుకోవాలని అనుకున్నారట రవిరాజా పినిశెట్టి. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి ఖుష్బూ తప్పుకున్నారు. దీంతో ఆమె ప్లేసులో మీనాను హీరోయిన్ గా తీసుకున్నారట.

చంటి చిత్రం తమిళ్ కంటే తెలుగులో బాగా ఆడింది. వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జనవరి 10, 1992 న విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో ఘనవిజయం సాధించింది. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని పాడిన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది. ఫిమేల్ సింగర్ గా చిత్ర రెండు పాటలు పాడారు. ఇళయరాజా సంగీతం అందించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here