అరటిపండ్లను ఎక్కువగా చాట్స్, స్మూతీస్,షేక్‌ల రూపంలో తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే, అరటిపండు ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, బి, ఐరన్, మాంగనీస్ వంటి అనేక ఇతర ఖనిజాలు, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అరటిపండుతో హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉండే పోషకాలు జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. ఇది జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలోనూ సహాయపడుతుంది. హెయిర్ మాస్క్ రూపంలో అరటిపండ్లు మీ జుట్టుకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
చుండ్రును తగ్గిస్తుంది
చలికాలంలో చుండ్రు సర్వసాధారణం. అటువంటి పరిస్థితులలో అరటి హెయిర్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో అరటిపండ్లను తీసుకుని, మెత్తగా చేయాలి. దానికి 2 టీస్పూన్ల నిమ్మరసం కలపండి. దీనికి ట్రీ ఆయిల్ ను జోడించండి. వీటన్నింటినీ మిశ్రమంగా చేసి.. ఈ హెయిర్ మాస్క్ ను స్కాల్ప్, హెయిర్ పై అప్లై చేయండి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగండి. ఫలితాన్ని మీరే చూడండి.
మెరిసే జుట్టు కోసం
దుమ్ము, సూర్యకాంతి, కాలుష్యం కారణంగా జుట్టు తన మెరుపును కోల్పోతుంది. మీ జుట్టు మెరిసేలా చేయడానికి ఒక గిన్నెలో అరటిపండును తీసుకుని, దాన్ని మెత్తగా గ్రైండ్ చేయండి. దీనికి 2 నుండి 3 చెంచాల తేనె కలపండి. ఇందులో ఒక చెంచా ఓట్ మీల్ పౌడర్ కూడా కలపండి. ఈ పదార్థాలను బాగా మిక్స్ చేసి జుట్టు, తలకు అప్లై చేయండి. 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగండి.
పొడవాటి జుట్టు కోసం
పొడవాటి జుట్టు కోసం, ఒక గిన్నెలో అరటిపండ్లను తీసుకుని మెత్తగా చేయాలి. ఇప్పుడు మిక్స్‌డ్ పోపు వేయాలి. ఈ రెండు మిశ్రమాలను బాగా కలపండి. ఈ హెయిర్ మాస్క్ ను హెయిర్ స్కాల్ప్ మీద కాసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.