మీరు నైట్ టైంలో సరిగా నిద్రపోతున్నారా? 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది మెదడు పనితీరును తగ్గిస్తుంది, కండరాల రికవరీ కూడా తగ్గుతుంది. అంతే కాదు ఇది మానసిక ఆరోగ్య సమస్యలను సైతం కలిగిస్తుంది. మీ నిద్ర షెడ్యూల్ ని సరి చేయడానికి ఇక్కడ ఉన్న సులభ మార్గాలు ఉన్నాయి.
లైట్ లేకుండా :
మీ ఫోన్ నుండి వచ్చే నీలి కాంతి మీ మెదడును అప్రమత్తంగా, మెలకువగా ఉండాల్సిన సమయాన్ని సూచిస్తుంది. ఇది నిద్రపోయే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. నిద్రపోయే ముందు కనీసం ఒక గంట ముందు ఫోన్ లేదా ఇతర డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయండి.
పని లేకుండా 2 గంటలు:
నిద్రపోయే ముందు మీ మనస్సు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వండి. పడుకునే ముందు కనీసం 2 గంటల ముందు మీ పని పూర్తి చేయడానికి ట్రై చేయండి.
వ్యాయామం లేకుండా :
పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి నిద్రపోవడానికి కష్టతరం చేస్తాయి.
సూర్యకాంతి:
ఉదయం వచ్చే ఎండలో నిలబడడం వల్ల సిర్కాడియన్ రిథమ్ సెట్ అవుతుంది. ఇది రాత్రి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.
కెఫిన్ లేకుండా :
ఇది ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మంచి నిద్ర కోసం మీ ఆహారం నుండి కెఫిన్ ను నివారించండి.