ఆరోగ్యకరమైన జీవనం కోసం మిరాకిల్ స్మూతీస్

కిడ్నీ డిటాక్స్:

ఒక క్యారెట్, 2-3 పుచ్చకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక దోసకాయ.. వీటన్నింటినీ వేసి స్మూతిగా చేసుకుని తాగండి.

జలుబు, దగ్గు నివారణకు:

ఒక క్యారెట్, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి పాయలు, పైనాపిల్ ముక్కలు.. ఈ అన్ని పదార్థాలను కలిపి జ్యూస్ చేయండి. ఇది రోజుకి ఒకసారి ఒక గ్లాస్ తాగండి.

మీరు అర్థరైటీస్తో బాధపడుతుంటే:

ఈ పానీయం సిద్ధం చేయడానికి క్యారెట్, సెలెరీ పైనాపిల్, నిమ్మకాయలని కలపి తాగండి. ఇవి శరీరానికి విటమిన్ సిని అందిస్తాయి.

మీరు మూడీగా ఉన్నప్పుడు:

దీని కోసం క్యారెట్, సెలెరి, దానిమ్మ రసం త్రాగండి. ఇది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా, హుషారుగా ఉండేలా చేస్తుంది.

హ్యాంగోవర్ ను నయం చేయడానికి:

హ్యాంగోవర్ ను పోగొట్టడానికి ఆపిల్, క్యారెట్, బీట్రూట్, లెమన్ లతో తయారు చేసిన స్మూతీ చాలా మేలు చేస్తుంది. దాని వల్ల వచ్చే తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

డిప్రెషన్స్ సమయంలో:

ఒక క్యారెట్, ఆపిల్, బీట్రూట్, అరకప్పు బచ్చలి కూరను కలిపి స్మూతీ తయారు చేసి తాగండి. ఇది డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి మంచి మేలు చేస్తుంది, ప్రయోజనాన్ని అందిస్తుంది.

మలబద్ధకం నివారణకు:

ఒక క్యారెట్, ఒక ఆపిల్ సమాన మొత్తంలో తీసుకుని దానికి క్యాబేజీని కలిపి స్మూతీగా సిద్ధం చేసి తాగండి. ఇది మలబద్దకాన్ని త్వరగా నివారిస్తుంది.

ఒత్తిడిని తగ్గించడానికి:

2- 3 అరటి పండ్లు, 6-8 స్ట్రాబెరీలు, 2 బేరి పండ్లను నీటిలో కలపండి. వీటితో చేసిన స్మూతీస్.. మనసును రిలాక్స్ గా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here