వర్షాకాలంలో వచ్చే వ్యాధులు తీవ్ర పరిణామాలను చూపిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఇన్ఫెక్షన్లు వంటివి ధీర్ఘకాలం పాటు వేధిస్తాయి. అందుకు ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించడం చాలా అవసరం.
హైడ్రెషన్
హైడ్రేట్ గా ఉండడానికి, సరైన పనితీరును నిర్వహించడానికి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.
వెచ్చని పానీయాలు
వర్షాకాలంలో హెర్బల్ టీలు, సూప్ లు, అల్లం కలిపిన పానీయాలు వంటివి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, శరీరానికి పోషకాలు అందిస్తాయి.
సీజనల్ పండ్లు
విటమిన్లు, ఖనిడాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆపిల్, బేరి, దానిమ్మ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రోబయోటిక్స్
పెరుగు, కేఫీర్, పులియబెట్టిన కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన జీవనం కోసం, రోగ నిరోధక శక్తి పెరుగుదలకు మైక్రోబయోమ్ కు సపోర్ట్ ఇచ్చేందు, పోషకాల శోషణకు ఇవి సహకరిస్తాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయలు
ఇవి రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవనానికి తోడ్పడ్డుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు
సిట్రస్ పండ్లు లేదా విటమిన్ సి ఉండే కివీస్, బెల్ పెప్పర్స్, బ్రోకలీ లాంటి పండ్లు, కూరగాయలు ఈ వర్షాకాలంలో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.