హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటింది. అయితే సిమ్రాన్‌కు ఒక చెల్లెలు ఉందని, ఆమె కూడా హీరోయిన్‌గా నటించింది అన్నది చాలా మందికి తెలియదు. ఇంద్రధనుష్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి్ంది సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావెల్ తెలుగులో ఇష్టం సినిమాకు తొలిచిత్రం. లో విజయ్ సరసన నటించిన బద్రి చిత్రం ఆమెకు తమిళ్ లో తొలి చిత్రం.
స్టార్ హీరోయిన్ చెల్లెలిగా ఎంట్రీ ఇవ్వడంతో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ అందుకుంది మోనాల్ . అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఫ్లాపులతో అపజయాలను చవిచూసింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే మోనాల్ సూసైడ్ చేసుకుంది. 21 ఏళ్ల వయస్సులో 2002, ఏప్రిల్ 14న తన ఫ్లాట్‌లోనే ఉరివేసుకుని చనిపోయింది. అప్పట్లో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
మోనాల్ మరణించే సమయానికి కొన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో సుమన్ తో నటించిన తెలుగు చిత్రం దాదాగిరి, తమిళంలో ఈశ్వర్, యుగేంద్రన్ లతో కలిసి నటించిన బెస్ట్ ఆఫ్ లక్ అనే చిత్రాలు ఉన్నాయి. ఆమె మరణించిన రోజున కూడా తన కొత్త చిత్రం పయియే జన్మం ప్రారంభోత్సవానికి హాజరయింది. మోనల్ నావల్ మరో సోదరి జ్యోతి 2003లో చిత్రరంగంలోకి రంగప్రవేశం చేసింది.